ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అభివృద్ధికి 35 ఏళ్లు చాలదా?

ABN, First Publish Date - 2021-04-13T06:43:01+05:30

నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే 35 ఏళ్లు సరిపోలేదా అని మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రశ్నించారు. అనుముల మండలం మదారిగూడెం, పేరూరు గ్రామంలో అభ్యర్థి భగత్‌తో కలిసి సోమవారం రాత్రి ప్రచారంలో మాట్లాడారు.

ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతున్న మంత్రి జగదీ్‌షరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంత్రి జగదీ్‌షరెడ్డి


హాలియా, ఏప్రిల్‌ 12: నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలంటే 35 ఏళ్లు సరిపోలేదా అని మంత్రి జగదీ్‌షరెడ్డి ప్రశ్నించారు. అనుముల మండలం మదారిగూడెం, పేరూరు గ్రామంలో అభ్యర్థి భగత్‌తో కలిసి సోమవారం రాత్రి ప్రచారంలో మాట్లాడారు. ఇక్కడి ప్రజలు ఏడుసార్లు గెలిపిస్తే 35ఏళ్లు ఎమ్మెల్యేగా, 14ఏళ్లు మంత్రిగా ఉన్న జనారెడ్డి కనీసం 18 ఏళ్ల క్రితం ప్రారంభించిన లోలెవల్‌ కెనాల్‌ పనులను పూర్తి చేయలేకపోయారని విమర్శించారు. అధికారం కోల్పోయాక జానాకు అభివృద్ధి గుర్తు వచ్చిందా అన్నారు. నాగార్జునసాగర్‌ నిర్మించి ఎంతోకాలమైందని, దానికి ఆనుకొని ఉన్న నెల్లికల్లుకు ఎందుకు నీళ్లు అందించలేకపోయారో ప్రజలకు జానా సంజాయిషీ ఇవ్వాలన్నారు. ఏళ్ల క్రితం ప్రారంభించిన లోలెవల్‌ కెనాల్‌ పనులు 10 శాతం కూడా పూర్తిచేయలేని, టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక మూడేళ్ల వ్యవధిలో సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టిపెట్టి పూర్తి చేశారని గుర్తు చేశారు. ఏం చేశారో చెప్పలేకే కాంగ్రెస్‌ పార్టీ నేతలు వ్యక్తిగత దూషణలకు పాల్పడుతున్నారని ఇది సరికాదన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేరు కోనప్ప, నాయకులు ఎంసీ.కోటిరెడ్డి, యడవెల్లి విజయేందర్‌రెడ్డి, పేర్ల సుమతి పురుషోత్తం, కందుల సైదులు, పాల్గొన్నారు.

Updated Date - 2021-04-13T06:43:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising