శివన్నగూడ రిజర్వాయర్ పనుల అడ్డగింత
ABN, First Publish Date - 2021-04-24T07:08:18+05:30
శుక్రవారం రాత్రి రిజర్వాయర్ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్లగూడెం గ్రామంలో ప్రభుత్వ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించినా ఇప్పటివరకు తమకు పునరావాసంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అదేవిధంగా కొంతమందికి పరిహారం సైతం చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
మర్రిగూడ, ఏప్రిల్ 23 : శుక్రవారం రాత్రి రిజర్వాయర్ పనులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చర్లగూడెం గ్రామంలో ప్రభుత్వ అధికారులు ఇంటింటి సర్వే నిర్వహించినా ఇప్పటివరకు తమకు పునరావాసంపై స్పష్టత ఇవ్వలేదన్నారు. అదేవిధంగా కొంతమందికి పరిహారం సైతం చెల్లించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. చర్లగూడెం గ్రా మం చుట్టూ మట్టి తవ్వకాలు చేపట్టడంతో రాత్రివేళలో శబ్దాలు, దుమ్ము, ధూళితో ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. తమకు పు నరావాసం కల్పించేంత వరకు పనులు నిలిపివేయాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికొచ్చి నిర్వాసితులకు సర్దిచెప్పినా వినకుండా పనులు నిలిపివేసి ఇంటికి వెళ్లిపోయారు.
Updated Date - 2021-04-24T07:08:18+05:30 IST