ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో 13మంది మృతి

ABN, First Publish Date - 2021-05-13T07:25:17+05:30

ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో బుధవారం 13మంది మృతిచెందారు. భార్య కుమారుడికి కరోనా రావడంతో ఆందోళన చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 పాజిటివ్‌ ఆందోళనతో ఒకరు ఆత్మహత్య
 మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో 10మందికి పాజిటివ్‌
నల్లగొండ, మే 12: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో కరోనాతో బుధవారం 13మంది మృతిచెందారు. భార్య కుమారుడికి కరోనా రావడంతో ఆందోళన చెందిన వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో 10మంది సిబ్బందికి కరోనా రావడంతో విధులకు హాజయ్యేందు సిబ్బంది జంకుతున్నారు. బుధవారం  1117 కేసులు నమోదయ్యాయి. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 13మంది మృతిచెందారు. ఇప్పటి వరకు మొత్తం 89134 కరోనా పాజిటివ్‌ బారిన పడగా 387మంది మృతిచెందారు. 59,760మంది కోలుకొని డిశార్జి అయ్యారు. 28,987మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. చండూరు పట్టణానికి చెందిన వృద్ధురాలు(78) కరోనాతో మృతిచెందింది. కుటుంబసభ్యులు మునిసిపల్‌ సిబ్బంది సహకారంతో దహన సంస్కారాలు నిర్వహించారు. దేవరకొండ మండలంలో 65ఏళ్ల వృద్ధురాలు మాల్‌లోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో  చికిత్స పొందుతూ మృతిచెందింది. చింతపల్లి మండలంలో 55ఏళ్ల వృద్దుడు కరోనాతో మృతి చెందాడు. గుర్రంపోడు మండలంలోని ముత్తిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన మహిళ(50), వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తి(53) కరోనాతో మృతిచెందారు. శాలిగౌరారం మండలం ఇటుకలపహాడ్‌ గ్రామానికి  ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీఎంఎస్‌ మాజీ చైర్మన పాలవరపు లక్ష్మీనర్సయ్య(94) కరోనాతో మృతిచెం దారు. భువనగిరి మండలం బొల్లేపల్లి గ్రామంలో కరోనాతో 70ఏళ్ల వయస్సుల గల ఇద్దరు వృద్ధులు  మృతిచెందారు. ఆత్మకూర్‌(ఎం) మండల కేంద్రంలో ఒకరు, కొరటికల్‌ గ్రామంలో మరొకరు కరోనాతో మృతిచెందారు. చౌటుప్పల్‌ మండలం జైకేసారం గ్రామానికి చెందిన ఓ కుటుంబంలో భార్య, కుమారుడికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో తనకు సైతం కరోనా వచ్చిందని ఆందోళనతో భర్త(38) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మర్రిగూడ ప్రభుత్వ ఆస్పత్రిలో 10మంది సిబ్బంది కరోనా బారినపడి అస్వస్థతకు గురయ్యారు. మొత్తం 17మంది సిబ్బందికిగాను 10మందికి కరోనా పాజిటివ్‌ రావడంతో మిగతా సిబ్బంది విధులకు హాజరయ్యేందుకు జంకుతున్నారు. సూర్యాపేట జిల్లా నాగారం మండల పరిఽధిలోని పసునూరు గ్రామానికి చెందిన పంచాయతీ సేవకుడు బుధవారం కరోనాతో మృతిచెందాడు. పాలకవీడు మండలం గుడుగుంట్లపాలెం గ్రామానికి చెందిన వృద్ధురాలు(75), అర్వపల్లిలో ఓ వ్యక్తి కరోనా పాజిటివ్‌తో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతిచెందాడు.

Updated Date - 2021-05-13T07:25:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising