ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సురభి నాటకాలను ఆదరించాలి

ABN, First Publish Date - 2021-02-28T06:01:34+05:30

విజయ భారతి నాట్యమండలి, శారద విజయ నాట్యమండలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన మాయాబజార్‌ నాటకం ఆకట్టుకుంది.

నాటకంలో కళాకారుల ప్రదర్శన
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 నాటక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వేణుగోపాల్‌రావు
నల్లగొండ క ల్చరల్‌, ఫిబ్రవరి 27 :
విజయ భారతి నాట్యమండలి, శారద విజయ నాట్యమండలి సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని అంబేడ్కర్‌ ఆడిటోరియంలో శనివారం నిర్వహించిన మాయాబజార్‌ నాటకం ఆకట్టుకుంది. వివిధ పాత్రల్లో కళాకారులు అత్యుత్తమ ప్రదర్శన కనబర్చి ఆకట్టుకున్నారు. మాయాబజార్‌ నాటకాన్ని సురభి నాటక సంఘం ప్రధాన కార్యదర్శి ఆర్‌.వేణుగోపాల్‌రావు ప్రారంభించి మాట్లాడారు. కరోనాతో నాటకాలు ఆగిపోయి కళాకారులు అనేక ఇబ్బందులు పడుతున్నారని, కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సాయంతో సురభి నాటకాలను తిరిగి నల్లగొండలో ప్రారంభించామని, వీటిని అందరూ ఆదరించాలని కోరారు.  రెం డు రోజులు నల్లగొండలోనే పాతాళ భైరవి, భక్తప్రహ్లాద నాటకాలను ప్రదర్శిస్తామన్నారు. కలెక్టర్‌, అదనపు కలెక్టర్‌ సహకారం, మిర్యాలగూడ, నల్లగొండ రైస్‌ మిల్లర్స్‌ అసోసియేషన్‌ అఽధ్యక్షుడు కె.రమేష్‌, యాదగిరి ఆర్థిక సాయ ంతో ఉచితంగా ప్రదర్శిస్తున్న నాటకాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంత రం భారీ సెట్టింగ్‌, ట్రిక్స్‌, సిన్స్‌, వైర్‌ వర్క్‌లతో 40మంది కళాకారులు మాయాబజార్‌ నాటకాన్ని ప్రదర్శించి ఆకట్టుకున్నారు. శ్రీకృష్ణుడిగా ఆర్‌.దినకర్‌, బలరాముడిగా రాంమోహన్‌రావు, ఘటోత్కచుడిగా శివరంగ్‌, అభిమన్యుడిగా ఆర్‌.శుభకర్‌, శశిరేఖగా మాన స, సుభద్రగా శాంతి తమ పాత్రలను చక్కగా పోషించారు. ప్రధానంగా శ్రీకృష్ణుని కనుసన్నుల్లో ఘటోత్కచుడు చుట్టూ మాయాబజార్‌ నాటకం సాగింది. చివరకు శశిరేఖ, అభిమన్యుల వివాహంతో కథ ముగిసింది.
=========================

Updated Date - 2021-02-28T06:01:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising