ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎమ్మెల్యే పదవికి పోటీచేయను: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

ABN, First Publish Date - 2021-08-14T21:25:35+05:30

మునుగోడు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీచేయనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్గొండ: మునుగోడు అభివృద్ధికి భారీగా నిధులు కేటాయిస్తే ఎమ్మెల్యే పదవికి పోటీచేయనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి ప్రకటించారు. టీఆర్‌ఎస్‌ సర్పంచ్ ఉన్న దగ్గర కాంగ్రెస్ ఎమ్మెల్యేని శంకుస్థాపన చేయనీయడం లేదని ఆక్షేపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్న దగ్గర మంత్రిని మునుగోడు నియోజకవవర్గంలో తిరగనీయమని హెచ్చరించారు. ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే అక్కడ వేల కోట్లు కుమ్మరించడం సీఎం కేసీఆర్‌కు అలవాటుగా మారిందని తప్పుబట్టారు. వేరే పార్టీ నేతలను గెలవనీయకుండా కేసీఆర్ కుట్ర చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు.


ఇటీవల ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇలాంటి సవాలే విసిరారు. భువనగిరి పార్లమెంట్ పరిధిలో ఉన్న సమస్యలను పరిష్కరిస్తే ఎంపీ పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. అంతేకాదు రాబోయే ఎన్నికల్లో పోటీ చేయనని ప్రకటించి తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారారు. రాష్ట్రంలో పలు పనులకు సంబధించి కాంట్రాక్టర్లకు రూ. 1,350 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. హిట్లర్ బతికుంటే కేసీఆర్‌ను చూసి ఏడ్చేవాడని వెంకటరెడ్డి ఎద్దేవాచేశారు.

Updated Date - 2021-08-14T21:25:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising