ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం

ABN, First Publish Date - 2021-11-30T07:14:29+05:30

తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం వస్తుందని తెలంగాణ ఉద్యాన పట్టు పరిశ్రమ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం’ అనే అంశంపై మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో సోమవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు.

శిక్షణ శిబిరంలో మాట్లాడుతున్న వెంకట్రామిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50


గరిడేపల్లి రూరల్‌, నవంబరు 29: తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం వస్తుందని తెలంగాణ ఉద్యాన పట్టు పరిశ్రమ డైరెక్టర్‌ ఎల్‌.వెంకట్రామిరెడ్డి అన్నారు. ‘శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకం’ అనే అంశంపై మండలంలోని గడ్డిపల్లి కేవీకేలో సోమవారం నిర్వహించిన శిక్షణలో ఆయన మాట్లాడారు. శాస్త్రీయ పద్ధతిలో తేనెటీగల పెంపకంతో స్వయం ఉపాధితో పాటు అధిక ఆదాయం సాధించవచ్చని తెలిపారు. తేనెటీగలతో ఆదా యం, ఆరోగ్యం కూడా లభిస్తుందన్నారు. శిక్షణ పొందిన యువకులకు ఉద్యాన శాఖ పరంగా ఇతర సబ్సిడీలు ఉంటే యువతకు సాయంగా ఉంటామని తెలిపారు. అనంతరం కేవీకేలోని వివిధ ప్రదర్శన క్షేత్రాలను సందర్శించారు. జీవన ఎరువులు, అజొల్లా, బత్తాయి, మామిడి, నర్సరీ హరిత గృహాల్లో కూరగాయల నారు పెంచడం, వర్మి కంపోస్టు, కోడి పిల్లల పెంపకం, ఫిష్‌ కల్చర్‌ను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర హార్టికల్చర్‌ జాయింట్‌ డైరక్టర్‌ బి. సరోజినిదేవి, పట్టు పరిశ్రమ అధికారి శ్రీధర్‌, నల్లగొండ జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ శాఖ అధికారి జి.సంగీతలక్ష్మి, పి.రవింద్రకుమార్‌, డాక్టర్‌ జి.సత్యనారాయణరెడ్డి, బి.లవకుమార్‌, శాస్త్రవేత్తలు సీహెచ్‌. నరేష్‌, కిరణ్‌, డి.నరేష్‌, ఆదర్శ్‌, సుగంధి పాల్గొన్నారు.  

Updated Date - 2021-11-30T07:14:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising