ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైద్యం వికటించి కొవిడ్‌ బాధితుడి మృతి

ABN, First Publish Date - 2021-07-30T06:40:56+05:30

కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుడికి వైద్యులు అందించిన చికిత్స వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు.

ఆస్పత్రి ఎదుట ఆందోళన చేస్తున్న ఇద్దయ్య బంధువులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మిర్యాలగూడ అర్బన్‌, జూలై 29 : కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతున్న వృద్ధుడికి వైద్యులు అందించిన చికిత్స వికటించి మృతి చెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు గురువారం ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. మృతుడి బ ంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. మిర్యాలగూడ మండలం బాదలాపురం గ్రామానికి చెందిన కొండూరు ఇద్దయ్య(70) కొవిడ్‌ లక్షణాలతో బాధపడుతుండగా కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం డాక్టర్స్‌ కాలనీలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో బుధవారం చేర్పించారు. రోగిని పరిశీలించిన వైద్యులు చికిత్స మొదలుపెట్టారు. గురువా రం ఉదయం ఇంజక్షన్‌ ఇచ్చాక ఆరోగ్య పరిస్థితి మరింత విషమించి అపస్మారక స్థితిలోకి వెళ్లిన కొద్దిసేపటికి తుదిశ్వాస విడిచాడు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే వృద్ధుడు మృతిచెందాడని ఆరోపిస్తూ బాధిత కుటుంబసభ్యులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉధ్రిక్తంగా మారడంతో ఆస్పత్రి వర్గాలు వన్‌టౌన్‌ పోలీసులకు సమాచారం అందించాయి. ఆస్పత్రి వద్దకు చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించారు. అనంతరం కొందరు పెద్దమనుషులు జోక్యం చేసుకొని ఇరువర్గాల మధ్యరాజీ కుదిర్చడంతో మృతదేహాన్ని తీసుకెళ్లారు. ఈ విషయమై ఎలాంటి ఫిర్యాదు తమకు అందలేదని వన్‌టౌన్‌ పోలీసులు తెలిపారు.


Updated Date - 2021-07-30T06:40:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising