ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

క్షేత్రపాలకుడికి ఆకుపూజ

ABN, First Publish Date - 2021-09-29T05:48:18+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామికి నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యార్చన లు మంగళవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్దఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభి షేకించిన ఆచార్యులు, సింధూరం, వివిధ ర

క్షేత్రపాలకుడు ఆంజనేయుడికి నాగవల్లీ దళార్చన నిర్వహిస్తున్న అర్చకుడు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి టౌన్‌, సెప్టెంబరు 28: యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రంలో క్షేత్రపాలకుడు ఆంజ నేయస్వామికి నాగవల్లీ దళార్చనలు, స్వామికి నిత్యార్చన లు మంగళవారం శాస్త్రోక్తంగా కొనసాగాయి. కొండపైన విష్ణుపుష్కరిణి వద్దఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో అర్చకులు పంచసూక్తాలు, మన్యుసూక్త పఠనాలతో అభి షేకించిన ఆచార్యులు, సింధూరం, వివిధ రకాల పూలతో అలంకరించారు. ఆంజనేయుడి సహస్రనామాలతో నాగవ ల్లీ దళార్చనలు జరిపారు. బెల్లం పానకం, వడపప్పు, బూ రెలు, అరటిపండ్లు నివేదన చేశారు. హనుమంతుడికి ప్రతిరూపాలైన వానరాలకు అరటిపండ్లను ఆహారంగా అందజేశారు. అదేవిధంగా పాతగుట్ట ఆలయంలో ఆంజనే యస్వామికి పంచామృతాలతో అభిషేకం, సహస్రనామార్చ నలు శాస్త్రోక్తంగా జరిపారు. ప్రధానాలయంలో, పుష్కరిణి చెంతున్న ఆంజనేయస్వామిని వేదమంత్రాలతో అర్చకులు పూజలు చేసి మహానివేదనలు జరిపారు. వేకువజామునే ప్రధానాలయంలోని స్వయంభువులను, బాలాలయ కవచ మూర్తులను కొలిచిన పూజారులు ఉత్సవమూర్తులను అభిషేకించి అర్చించారు. సుదర్శన హోమం, నిత్యకల్యాణ పర్వాలను ఆగమ శాస్త్రరీతిలో నిర్వహించారు. శివాలయంలో రామలింగేశ్వరుడికి, ఉపాలయంలో చరమూర్తు లకు నిత్య పూజలు, కొండకింద పాత గోశాలలో సత్యనారాయణ స్వామి వ్రత పూజలు శైవ సంప్రదాయ పద్ధతిలో కొనసాగాయి. భక్తుల నుంచి వివిధ విభాగాల ద్వారా స్వామివారికి రూ.4,13,283 ఆదా యం సమకూరినట్టు దేవస్థాన అధికారులు తెలిపారు.

Updated Date - 2021-09-29T05:48:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising