ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలి

ABN, First Publish Date - 2021-10-23T06:13:45+05:30

రెండురోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు.

దాన్నం రాశుల వద్ధ రైతులతో నిరసన తెలుపుతున్న జూలకంటి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతా

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ రూరల్‌, అక్టోబరు 22: రెండురోజుల్లో ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేదంటే నిరవధిక నిరాహార దీక్ష చేపడతానని సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి హెచ్చరించారు. సీపీఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డితో కలిసి ఆర్జాలబావి వద్ద గల ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు కుప్పగా పొసి న ధాన్యాన్ని శుక్రవారం పరిశీలించారు. మొలకెత్తిన ధాన్యం గురించి, అక్కడున్న రైతులను అడిగి తెలుసుకున్నారు. అనంత రం జిల్లాకేంద్రంలోని సీపీఎం కార్యాలయంలో ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంట ను అమ్ముకునేందుకు నరకయాతన పడుతున్నారని అవేదన వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దేవుళ్లపైన ఉన్న ప్రేమ, అన్నం పెట్టే రైతులపైన లేదన్నా రు. రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 18వ తేదీ నుంచి ఐకేపీ కేంద్రాలు ఏర్పాటుచేసి ధాన్యం కొనుగోలు చేస్తామని ప్రకటించి, నేటి వరకు ధాన్యం కొనుగోలు చేయకపోవడం విడ్డూరంగా ఉందన్నారు. రైతులు బోరు, బావు ల కింద పండించిన వరి ధాన్యాన్ని 25 రోజులుగా కేంద్రాల వద్ద కుప్పలుగా పోసి పడిగాపులు కాస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తెచ్చిన ధాన్యం ఎండకు ఎండి వానకు తడుస్తుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ఐకేపీ కేంద్రాలను  ఏర్పాటుచేసి వెంటనే ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్‌ చేశారు. లేదంటే సోమవారం నుంచి కలెక్టరేట్‌ ఎదుట రైతులతో కలిసి నిరవధిక నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ఈ సందర్భంగా ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు తుమ్మల వీరారెడ్డి, బండా శ్రీశైలం, పాలడుగు నాగార్జున, సయ్యద్‌ హశం, సత్తయ్య, కృష్ణారెడ్డి, మధుసూదన్‌రెడ్డి, వెంకన్న పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-23T06:13:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising