ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN, First Publish Date - 2021-05-10T06:37:17+05:30

యాసంగి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధి కారులను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఆదేశించారు.

యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం అనంతారం కొనుగోలు కేంద్రాన్ని తనిఖీ చేస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ 

భువనగిరి రూరల్‌, మే 9: యాసంగి ధాన్యం కొను గోలు ప్రక్రియను వేగవంతం చేసి రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధి కారులను కలెక్టర్‌ అనితా రామచంద్రన్‌ ఆదేశించారు. మార్కెటింగ్‌, వ్యవసాయ, రెవెన్యూ, పౌరసరఫరాల శాఖ ల అధికారులతో ఆదివారం నిర్వహించిన గూగుల్‌ మీట్‌ కాన్ఫరెన్స్‌లో ఆమె మాట్లాడారు. జూన్‌ మొదటి వారంలో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు సమ న్వయంతో వచ్చే 20 రోజుల్లో కొనుగోళ్లు పూర్తి చేసి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని సూచించారు. రామ న్నపేట, వలిగొండ, పోచంపల్లి మండలాల్లో ధాన్యం ఎక్కువగా విక్రయానికి వస్తున్నందున లారీలు సరిపోని పక్షంలో డీసీఎం వాహనాలను సైతం వినియోగించు కోవాలని తహసీల్దార్లకు సూచించారు. గూగుల్‌ మీట్‌లో అదనపు కలెక్టర్‌ డి.శ్రీనివాస్‌రెడ్డి, డీఆర్‌డీవో ఉపేందర్‌రెడ్డి, పౌర సరఫరాల డీఎం గోపీకృష్ణ, ఇన్‌చార్జి డీసీఎస్‌వో బ్రహ్మారావు, తదితరులు పాల్గొన్నారు. అదే విధంగా గుండాల మండలం అనంతారం ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్‌ తనిఖీ చేశారు.  

Updated Date - 2021-05-10T06:37:17+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising