ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా కట్టడిలో ప్రభుత్వాలు విఫలం

ABN, First Publish Date - 2021-05-17T06:18:20+05:30

కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు.

సమావేశంలో మాట్లాడుతున్న తమ్మినేని వీరభద్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వీరభద్రం
చిట్యాల, మే16 :
కరోనాను కట్టడిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఆదివారం చిట్యాల సీపీఎం కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కొవిడ్‌ హెల్ప్‌లైన సెంటర్‌ను ప్రారంభించి మాట్లాడారు. లాక్‌డౌనలో పాలకులు ప్రజలను పట్టించుకోవట్లేదని ఆవేదన వ్యక్తంచేశారు. వైద్యరంగంలో సౌకర్యాలను మెరుగుపరచాలని కరోనా తెలియజేసిందన్నారు. పార్టీ  ఆధ్వర్యంలో హైదరాబాద్‌ సుందరయ్య విజ్ఞానకేంద్రం, ప్రగతినగర్‌, ఖమ్మం పార్టీ కార్యాలయాల్లో కొవిడ్‌ భాదితుల కొరకు ఐసోలేషన సెంటర్లు ఏర్పాటు చేశామన్నారు. పార్టీ కేంద్ర కమీటీ సభ్యుడు చెరుపల్లి సీతారాములు మాట్లాడుతూ కరోనా సోకితే పేద ప్రజలు వైద్యం అందక చనిపోయే ప్రమాదం ఉందన్నారు. లాక్‌డౌన కారణంగా ఉపాధి కోల్పోయిన వలస కార్మికులకు కేరళ ప్రభుత్వం మాదిరిగా నిత్యావసర వస్తువులు పంపిణీ చేయాలన్నారు. కొవిడ్‌ భాదితులు వారి కుటుంబ సభ్యులు సహాయం కోసం 9490098325, 9848669077 నెంబర్లకు ఫోన చేయాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి, జిల్లా నాయకుడు జిట్ట నగేష్‌, మండల కార్యదర్శి అవిశెట్టి శంకరయ్య, శీలా రాజయ్య, రుద్రారపు పెద్దులు, జిట్ట సరోజ, మద్ది లింగయ్య, నాగార్జున పాల్గొన్నారు.

Updated Date - 2021-05-17T06:18:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising