ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయం : ఎమ్మెల్యే

ABN, First Publish Date - 2021-10-17T06:02:56+05:30

రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెంలో రాయినిగూడెం పీఏసీఎస్‌ గోడౌన్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పీఏసీఎస్‌ ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక రుణాలు, ఎరువులు, విత్తనా

సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గరిడేపల్లి రూరల్‌/ గరిడేపల్లి/ చింతలపాలెం, అక్టోబరు 16: రైతుల అభివృద్ధే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి అన్నారు. మండలంలోని కీతవారిగూడెంలో రాయినిగూడెం పీఏసీఎస్‌ గోడౌన్‌కు శనివారం శంకుస్థాపన చేశారు. రైతుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ ఎన్నో పథకాలు ప్రవేశపెట్టారన్నారు. పీఏసీఎస్‌ ద్వారా రైతులకు స్వల్పకాలిక, దీర్ఘ కాలిక రుణాలు, ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాలన్నారు. కార్యక్రమంలో హుజూర్‌నగర్‌ మార్కెట్‌ చైర్మన్‌ కడియం వెంకటరెడ్డి, రాయినిగూడెం పీఏసీఎస్‌ చైర్మన్‌ ముప్పారపు రామయ్య, సర్పంచ్‌ కీతా జ్యోతి రామారావు, ఎంపీటీసీ షేక్‌ మున్నీషా చాంద్‌మియా, వైస్‌ చైర్మన్‌ బొల్లేపల్లి రామనాధం, డైరెక్టర్లు సత్యనారాయణ, మామిడి వెంకటేశ్వర్లు, తుమ్మల సైదయ్య, నర్సయ్య, సైదులు పాల్గొన్నారు. అదేవిధంగా గరిడేపల్లి మండలకేంద్రంలో టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయాన్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రారంభించారు.  కార్యకర్తలు పార్టీ బలోపేతానికి సైనికుల్లా పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో సర్పంచ్‌ త్రిపురం సీతారామిరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గుగులోతు కృష్ణనాయక్‌, వక్కవంతుల పార్ధసారథి, ఎంపీటీసీ కడియం స్వప్న, మన్సూర్‌అలీ, ప్రధాని సైదులు పాల్గొన్నారు. చింతలపాలెం మండలంలోని నెమలిపురి గ్రామం వద్ద కృప ఆర్‌జిఆర్‌ ఆగ్రోగ్రేటర్స్‌ సంస్థకు ఎమ్మెల్యే సైదిరెడ్డి భూమిపూజ చేశారు. కార్యక్రమంలో కంపెనీ ఎండీ చావా ప్రసన్న, జెడ్పీటీసీ చింతరెడ్డి చంద్రకళ సైదిరెడ్డ్డి, వేములూరి రంగాచారి, కొప్పుల సైదిరెడ్డి, జక్కుల నాగేశ్వరరావు, గుజుల నర్సింహారెడ్డి పాల్గొన్నారు.

Updated Date - 2021-10-17T06:02:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising