ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మా భూములను టీఎ్‌సఐఐసీకి ఇవ్వం

ABN, First Publish Date - 2021-08-06T06:03:19+05:30

తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీఎ్‌సఐఐసీ)కు తమ భూములు ఇవ్వబోమని చౌటుప్ప ల్‌ మండలం దండుమల్కాపురం గ్రామస్థులు తే ల్చిచెప్పారు.

ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఎదుట ధర్నాలో దండుమల్కాపురం గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దండుమల్కాపురంలో ఇండస్ర్టియల్‌ పార్క్‌ ఎదుట ఆందోళన చేస్తున్న గ్రామస్థులు

చౌటుప్పల్‌ రూరల్‌, ఆగస్టు 5: తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక వసతుల సంస్థ (టీఎ్‌సఐఐసీ)కు తమ భూములు ఇవ్వబోమని చౌటుప్ప ల్‌ మండలం దండుమల్కాపురం గ్రామస్థులు తే ల్చిచెప్పారు. ఈ మేరకు గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ లో పనులను అడ్డుకొని పైలాన్‌ వద్ద రోడ్డుపై గ్రామస్థులు ధర్నా నిర్వహించారు. పార్క్‌లోకి వెళ్లే వాహనాల రాకపోకలను అడ్డుకున్నారు. టీఎ్‌సఐఐసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ గ్రీన్‌ ఇండస్ట్రియల్‌ పార్క్‌ ఏర్పాటుతో తమకు ఉపాధి కలుగుతుందనే ఉద్ధేశ్యంతో అతి తక్కువ ధరకు వందల ఎకరాల తమ భూములను గతంలో టీఎ్‌సఐఐసీ ఇచ్చామని తెలిపారు. తమ పిల్లల భవిష్యత్‌కోసం, ఇంటి నిర్మాణాలకు సర్వే నెంబర్లు 753, 754, 755, 758లలో 42 ఎకరాల భూమిని టీఎ్‌సఐఐసీ ఇవ్వకుండా కాపాడుకుంటూ వస్తున్నామని అన్నారు. 300మంది నిరుపేద కుటుంబాలకు చెందిన విలువైన ఈ భూములపై  కొంత మంది బడా నాయకుల కన్ను పడిందని ఆరోపించారు. ఆ నాయకులు టీఎ్‌సఐఐసీ అధికారులపై ఒత్తిడి తెచ్చి పేదలకు కేటాయించిన భూములను లాక్కోవడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. టీఎ్‌సఐఐసీ తన ప్రతిపాదనను విరమించుకొవాలని డిమాండ్‌ చేశారు. తమ ప్రాణాలు పోయినా సరే భూములు ఇచ్చేది లేదని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ వెల్వర్తి యాదగిరి, ఉప సర్పంచ్‌ మల్కాజిగిరి కృష్ణ, గ్రామస్థులు అత్తపురం భూపాల్‌రెడ్డి, అత్తపురం నరేందర్‌రెడ్డి, బొంతల ఓంప్రకాశ్‌, మీసాల నర్సింహ, మస్తాన్‌బాబు, రామస్వామి, లచ్చిరెడ్డి, అనంతరెడ్డి, హరిప్రసాద్‌ పాల్గొన్నారు.  

Updated Date - 2021-08-06T06:03:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising