ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలి : శరతచంద్ర

ABN, First Publish Date - 2021-05-09T05:55:28+05:30

ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఇంటింటి ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌ శరతచంద్ర కోరారు.

మెడికల్‌ కిట్‌ అందిస్తున్న మునిసిపల్‌ కమిషనర్‌ శరతచంద్ర
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ క్రైం, మే 8 : ప్రభుత్వ ఆదేశాల మేరకు పట్టణంలో ఇంటింటి  ఫీవర్‌ సర్వేను పకడ్బందీగా పూర్తి చేయాలని నల్లగొండ మునిసిపల్‌ కమిషనర్‌ శరతచంద్ర కోరారు. పానగల్‌ యూపీహెచసీ, అంగనవాడీ, మునిసిపల్‌ సిబ్బంది పట్టణంలోని గాంధీనగర్‌లో శనివారం చేపట్టిన సర్వేను తనిఖీ చేసి సర్వే సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ కొవిడ్‌ వ్యా ప్తి నేపథ్యంలో ప్రభుత్వం, కలెక్టర్‌ ఆదేశాల మేరకు లక్షణాలు ఉన్న వారిని త్వరగా గుర్తించి అవసరమైన పరీక్షలు, మందులు అందించి త్వరగా కోలుకునేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలందరు తమ ఆరోగ్య వివరాలు సర్వే సిబ్బందికి అందించి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఏఎనఎం శిరీష, ఆశాలు నాగమణి, రాణి, మునిసిపల్‌ సిబ్బంది అనిల్‌, అంగనవాడీ కార్యకర్తలు పాల్గొన్నారు.
పెద్దఅడిశర్లపల్లి : కరోనా నివారణకు ప్రభుత్వం చేపట్టిన ఇం టింటి సర్వేకు ప్రజలు సహకరించాలని పీఏపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సీహెచవో హరిలాల్‌ కోరారు. శనివారం ఆయన మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి సర్వే నిర్వహించి మాట్లాడారు. కరోనా లక్షణాలు ఎవరికైనా కనిపిస్తే వెంటనే పీహెచసీలో కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. కరోనా నియంత్రణకు 45ఏళ్లు దాటిన వారు తప్పకుండా వాక్సిన వేసుకోవాలన్నారు. మండలంలో మొదటిసారి వాక్సిన వేసుకున్న వారు రెండో వాక్సిన వేసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఏఎనఎంలు రాధ, పుష్ప, అలివేలు, మంగమ్మ, ఆశావర్కర్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-05-09T05:55:28+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising