ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాడిపరిశ్రమపై రైతులు దృష్టసారించాలి

ABN, First Publish Date - 2021-08-04T05:47:42+05:30

వ్యవసాయంతో పాటు అనుబంధరంగమైన పాడిపరిశ్రమపై రైతులు దృష్టిసారించి ఆదాయాభివృద్ధి సాధించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టర్‌ కార్యాలయంలోని ఉదయాదిత్యభవన్‌లో మంగళవారం నిర్వహించిన ఉమ్మడి జిల్లా గోపాలమిత్రల పునఃశ్ఛరణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండేందుకు పాలు ఎంతో అవసరమన్నారు.

నల్లగొండలో గోపాలమిత్ర సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి జగదీష్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

విద్యుత్‌ శాఖ మంత్రి జగదీ్‌షరెడ్డి

నల్లగొండ టౌన్‌, ఆగస్టు 3: వ్యవసాయంతో పాటు అనుబంధరంగమైన పాడిపరిశ్రమపై రైతులు దృష్టిసారించి ఆదాయాభివృద్ధి సాధించాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. నల్లగొండ కలెక్టర్‌ కార్యాలయంలోని ఉదయాదిత్యభవన్‌లో మంగళవారం నిర్వహించిన  ఉమ్మడి జిల్లా గోపాలమిత్రల పునఃశ్ఛరణ తరగతుల్లో ఆయన మాట్లాడారు. ఆరోగ్యంగా ఉండేందుకు పాలు ఎంతో అవసరమన్నారు. పాల ఉత్పత్తి తక్కువగా ఉండటం, డిమాం డ్‌ ఎక్కువగా ఉండటంతో కొందరు కల్తీకి పాల్పడుతున్నారని, దీంతో ప్రజారోగ్యం దెబ్బతింటోందన్నారు. గత ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్లే పశుసంపద వృద్ధి చెందలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగం, పాడి, పశుసంపద అభివృద్ధికి అన్ని చర్యలు తీసుకుంటోందన్నారు. వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామిగా ఉన్నా, కూరగాయలు, మాంసం ఉత్పత్తు లు మాత్రం పక్క రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తోందన్నారు. దీన్ని అధిగమించేందుకు పాలు, మాంసం ఉత్పత్తులు, కూరగాయల సాగుపై రైతులు దృష్టి సారించాలన్నారు. హరితవిప్లవంలో ఎరువుల వినియోగం అధికం అవడంతో భూసారం దెబ్బతింటోందన్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సేంద్రియ సాగుతో భూసారాన్ని కాపాడుతూ అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. పాలతో పోషకాహార ఉత్పత్తులు, వ్యర్థాలతో సేంద్రియ ఎరువులు తయారుచేయవచ్చని, దీంతో రైతులకు బహుళ ప్రయోజనం ఉంటుందన్నారు. పశువులకు ఆహారం కోసం మేలుజాతి గడ్డి విత్తనాలు ఉపయోగించాల ని సూచించారు. ఉమ్మడి జిల్లాలో పునరుత్పత్తి యోగ్యమైన పాడి పశువుల సంఖ్య 5,39,406 ఉండగా, 3,54,127 పశువులకు కృత్రిమ గర్భధారణ చేసినట్టు తెలిపారు. పాడి,  పశుసంపద పెంపొందించేందుకు గోపాలమిత్రలు క్షేత్రస్థాయిలో రైతులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రభుత్వం ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు కనీసవేతనం రూ.8500గా నిర్ణయించిందన్నారు.పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్‌ కోరికమేరకు గోపాలమిత్రలకు పీఆర్సీ వర్తింపు అంశాన్ని పరిశీలిస్తామన్నారు. డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ,గోపాలమిత్రలకు ఇన్సూరెన్స్‌ సౌకర్యం కల్పించేందుకు పశుగణాభివృద్ధి సంస్థ ఆలోచించాలన్నారు. సమావేశంలో పశుగణాభివృద్ధి సంస్థ రాష్ట్ర చైర్మన్‌ మోతె పిచ్చిరెడ్డి, సీఈ వో మంజువాణి, కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌, పశుసంవర్ధక శాఖ జేడీ సుబ్బారావు, ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, మునిపల్‌ చైర్మన్‌ సైదిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ పఽథకాలను సద్వినియోగం చేసుకోవాలి

ప్రభుత్వ పథకాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకోవాలని మంత్రి జగదీ్‌షరెడ్డి అన్నారు. పానగల్‌ ఉదయసము ద్రం వద్ద లైవ్‌ ఫిష్‌ సెంటర్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఇక్కడి రీసర్క్యులేట్‌ ఆక్వా కల్చర్‌ మత్స్యకారులకు  ఉపయోగపడుతుందన్నారు.

Updated Date - 2021-08-04T05:47:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising