ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తహసీల్దార్‌కార్యాలయంలో రైతు ఆత్మహత్యాయత్నం

ABN, First Publish Date - 2021-10-21T06:01:58+05:30

తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు ఒంటిపై కిరోసిస్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

కుమార్తెలతో కలిసి తహసీల్దార్‌ కార్యాలయానికి వచ్చిన వెంకటేశ్వర్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పట్టా మార్పిడి వివరాలు కోరిన రైతు : ఇవ్వని తహసీల్దార్‌

గరిడేపల్లి, అక్టోబరు 20 : తహసీల్దార్‌ కార్యాలయంలో రైతు ఒంటిపై కిరోసిస్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని తాళ్లమల్కాపురం గ్రామానికి చెందిన రైతు వట్టికూటి వెంకటేశ్వర్లు భూమిని కోర్టు ఆదేశాల మేరకు అతడి సోదరుడు రామారావు, అక్కాచెల్లెల పేరుమీద తహసీల్దార్‌ పట్టా మార్పిడి చేశారు. అయితే అందుకు సంబంధించిన ప్రొసీడింగ్‌ కాపీలు కావాలని వెంకటేశ్వర్లు తహసీల్దార్‌ కార్తీక్‌ను కోరారు. సాంకేతిక కారణాల వల్ల ఇవ్వలేకపోతున్నామని ఆయన తెలిపారు. అయితే సమాచార చట్టం కింద కూడా దరఖాస్తు చేసినా వెంకటేశ్వర్లుకు ప్రొసీడింగ్‌ కాపీలు రాలేదు. దీంతో విసుగుచెందిన వెంకటేశ్వర్లు తన నలుగురు కుమార్తెలతో కలిసి బుధవారం తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లాడు. అయినా సిబ్బందిని నుంచి సరైన  సమాధానం రాకపోవడంతో వెంట తెచ్చుకున్న పెట్రోల్‌ పోసుకుని ఆత్మహత్యకు యత్నించగా, చుట్టుపక్కల వారు వారించారు. ఘటనా స్థలానికి ఎస్‌ఐ కొండల్‌రెడ్డి సిబ్బందితో వచ్చి వెంకటేశ్వర్లుకు నచ్చజెప్పి పంపించారు. ఘటనపై తహసీల్దార్‌ కార్తీక్‌ వివరణ ఇస్తూ వట్టికూటి వెంకటేశ్వర్లు, అతడి కుమార్తెల పేరుమీద ఉన్న భూమి పట్టా మార్పిడి జరిగిన మాట వాస్తవమేనన్నారు. కోర్టు ఆదేశాల మేరకే చేశామన్నారు. సాంకేతిక కారణాల వల్ల ప్రొసీడింగ్‌ కాపీలు ఇవ్వలేకపోయామన్నారు. ఇందులో ఎలాంటి అక్రమాలకు తావులేదన్నారు. 


Updated Date - 2021-10-21T06:01:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising