ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రతిఒక్కరూ వ్యాక్సిన్‌ తీసుకోవాలి: జడ్పీటీసీ భిక్షం

ABN, First Publish Date - 2021-10-20T06:31:05+05:30

సూర్యాపేట మండలంలో అన్ని గ్రామాల్లో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జడ్పీటీసీ జీడీ భిక్షం కోరారు.

రామ్లాతండాలో వ్యవసాయ కూలీలకు వ్యాక్సినేషన్‌ను పరిశీలిస్తున్న జడ్పీటీసీ జీడీ భిక్షం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేటరూరల్‌/ నూతన్‌కల్‌/ చిలుకూరు, అక్టోబరు 19: సూర్యాపేట మండలంలో అన్ని గ్రామాల్లో వంద శాతం కరోనా వ్యాక్సినేషన్‌ పూర్తిచేయాలని జడ్పీటీసీ జీడీ భిక్షం కోరారు. మండల పరిధిలోని రామ్లాతండాలో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ను మంగళవారం పరిశీలించారు. పొలం పనులు చేస్తున్న రైతులు, కూలీలకు కరోనా టీకాపై అవ గాహన కల్పించారు. 100 శాతం వ్యాక్సినేషన్‌ పూర్తిచేసిన రామ్లాతండా సర్పంచ్‌ వాంకుడోతు స్వప్న నాగరాజును, వైద్య సిబ్బందిని అభినందించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ బాలాజీ, సేవ్యానాయక్‌, వాంకుడోతు నాగరాజు, సింగిల్‌విండో డైరెక్టర్‌ శంకర్‌, వైద్య సిబ్బంది స్వరూప, అంతమ్మ, సైదమ్మ, కవిత పాల్గొన్నారు. నూతన్‌కల్‌లో ఎంపీపీ భూరెడ్డి కళావతి సంజీవరెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ కరోనా నివారణకు వ్యాక్సిన్‌ తీసుకోవాలని కోరారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో ఇంటింటికీ తిరిగి వ్యాక్సిన్‌ వేస్తున్నారని తెలిపారు. సమావేశంలో ఎంపీటీసీలు ఏర్పుల నరేష్‌, రజిత లింగరాజు, సురికంటి జానకమ్మ ఉన్నారు. మండలంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని చిలుకూరు వైద్యాధికారి ప్రమోద్‌కుమార్‌ తెలిపారు. చిలుకూరు, బేతవోలు, నారాయణపురం, దూద్యాతండా గ్రామాల్లో నిర్వహించిన వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు కొడారు వెంకటేశ్వర్లు, చంద్రకళ నాగయ్య, తమ్మనబోయిన శంకర్‌, ఎంపీటీసీ వడ్డేపల్లి కళ్యాణికోటేష్‌, సిబ్బంది శ్రీనివాస్‌, ఇందిరా, భూలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-20T06:31:05+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising