ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎయిడ్స్‌ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ కృషిచేయాలి

ABN, First Publish Date - 2021-12-02T06:31:07+05:30

యిడ్స్‌ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్‌వో కోటా చలం కోరారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం పురస్కరించుకుని సూర్యాపేటలోని డీఎంహెచ్‌వో కార్యాయలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.

సూర్యాపేటలో విద్యార్థినులకు నగదు అందజేస్తున్న డీఎంహెచ్‌వో కోటాచలం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట టౌన్‌, డిసెంబరు 1: ఎయిడ్స్‌ రహిత సమాజానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని డీఎంహెచ్‌వో కోటా చలం కోరారు. ప్రపంచ ఎయిడ్స్‌ నివారణ దినం పురస్కరించుకుని సూర్యాపేటలోని డీఎంహెచ్‌వో కార్యాయలంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 5069 ఎయిడ్స్‌ కేసులు నమోదు కాగా 3250 మందికి చికిత్స పొందుతున్నారన్నారు. ఈ సందర్భంగా ఎయిడ్స్‌పై నిర్వహించిన వ్యాస రచన పోటీల్లో విజేతలకు నగదు బహుమతిని ఆయన అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ చంద్రశేఖర్‌, హర్షవర్థన్‌, వెంకటరమణ, కళ్యాణ్‌ పాల్గొన్నారు.

పలు మండలాల్లో ర్యాలీలు

నడిగూడెం/తుంగతుర్తి/మఠంపల్లి/తిరుమలగిరి: నడిగూడెం, తుంగ తుర్తి, మఠంపల్లి, తిరుమలగిరి మండలాల్లో ఎయిడ్స్‌పై అవగా హన ర్యాలీ  నిర్వహించారు. ఈ కార్యకమాల్లో వైద్యాఽధికారి లక్ష్మీప్రసన్న, డాక్టర్‌ నాగూనాయక్‌, వైద్యాధికారి ఫిరోజ్‌,  ఎచ్‌ఈవో సుముద్రాల సూరి, డాక్టర్‌ ప్రశాంత్‌ బాబు, సీహెచ్‌వో బిచ్చు నాయక్‌, రామచంద్రు, సంధ్యారాణి, పూలమ్మ, కలమ్మ, శ్రీలత, ఝాన్సీరాణి తదితరులు పాల్గొన్నారు.

ఎయిడ్స్‌ నిర్మూలనకు కృషి చేయాలి

హుజూర్‌నగర్‌: ఎయిడ్స్‌ నిర్మూలనకు ప్రతీ ఒక్కరు కృషి చేయాలని మండల ఆరోగ్య విస్తరణాధికారి ప్రభాకర్‌ కోరారు. పట్టణంలో తేజస్విని జూనియర్‌, డిగ్రీ కళాశాలలో విద్యార్థులకు నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడారు. కార్యక్ర మంలో డాక్టర్‌ పశ్య శ్రీనివాస్‌రెడ్డి, రమేష్‌, సైదులు, సత్యనారాయణ, వెంకటేశ్వర్లు, నాగేశ్వరరావు పాల్గొన్నారు. అదేవిధంగా పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఎయిడ్స్‌ అవగాహన ర్యాలీ నిర్వహించారు. కార్యక్ర మంలో ప్రిన్సిపాల్‌ అప్పారావు, శ్రీనివాస్‌, నగేష్‌, అనిల్‌, రవి, లక్ష్మీనారాయణ, నాగార్జున తదితరులు పాల్గొన్నారు. 

కోదాడ రూరల్‌: కోదాడ మండలంలోని కాపుగల్లు పీహెచ్‌సీలో ఎయిడ్స్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో వైద్యాధికారి సుధీర్‌ చక్రవర్తి, పీహెచ్‌ఎన్‌ లక్ష్మీ నర్సమ్మ, హెచ్‌ఈవో తిరుపతయ్య, సూపర్‌వైజర్‌ శ్రీనివాసరావు, ఏఎన్‌ఎంలు భవాని, చంద్రకళ, ఇందిరా, రూప పాల్గొన్నారు.

 కాంట్రాక్ట్‌ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

సూర్యాపేట టౌన్‌: అంతర్జాతీయ ఎయిడ్స్‌ నివారణ దినం సందర్బంగా ఎయిడ్స్‌ విభాగంలో విధులునిర్వహిస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు  సూర్యా పేట ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రిలో విధులు బహిష్కరించి నిరసన తెలిపారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ 2017లోనే వేతనాలు పెంచాల్సి ఉన్నా నేటికీ పెంచక పోవడం దారుణమన్నారు. కార్యక్రమంలో సుధాకర్‌, రాజన్‌, లక్ష్మి, చొక్కయ్య, లక్ష్మయ్య, విజయ్‌, జయచంద్రారెడ్డి పాల్గొన్నారు.





Updated Date - 2021-12-02T06:31:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising