ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కరోనా నిబంధనలతో విధులు అభినందనీయం

ABN, First Publish Date - 2021-01-16T06:05:46+05:30

కరోనా నేపథ్యంలో కోర్టుల్లో కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా వి ధుల నిర్వహణ అభినందనీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా పో ర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ అన్నారు.

కోర్టుల పనితీరును అడిగి తెలుసుకొంటున్న న్యాయమూర్తి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మిర్యాలగూడ కోర్టును సందర్శించిన హైకోర్టు న్యాయమూర్తి
మిర్యాలగూడ(లీగల్‌), జనవరి 15 :
కరోనా నేపథ్యంలో కోర్టుల్లో కక్షిదారులు, న్యాయవాదులు, సిబ్బందికి ఇబ్బందులు లేకుండా వి ధుల నిర్వహణ అభినందనీయమని ఉమ్మడి నల్లగొండ జిల్లా పో ర్టుపోలియో జడ్జి, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌అక్తర్‌ అన్నారు. శుక్రవారం ఆయన మిర్యాలగూడ కోర్టును సందర్శించా రు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో సైతం కక్షిదారులకు అత్యవసర సాయం అందిస్తున్నామన్నారు. అనంతరం కోర్టుల పనితీరును అడిగి తెలుసుకొన్నారు. కోర్టులో 8వ అదనపు జిల్లా న్యాయమూర్తి జగ్జీవన్‌కుమార్‌ బదిలీ కాగా ఈ పోస్టు ఖాళీగా ఉందని, ఈ కోర్టులోనే ఆరు కోర్టుల భవన నిర్మాణా ల విషయమై గతంలో తీసుకొన్న నిర్ణయాన్ని పరిశీలించాలని న్యాయవాదులు ఆయనకు వినతిపత్రం అందించారు. అంతకుముందు సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీదేవి, స్పెషల్‌ మెజిస్ట్రేట్‌ లక్ష్మీనారాయణ, బార్‌ అసోషియేషన్‌ అధ్యక్ష, కార్యదర్శులు నేతి సత్యనారాయణ, మన్నెం మనోహర్‌రెడ్డి పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. కార్యక్రమంలో నల్లగొండ అదనపు న్యాయమూర్తి భారతీదేవి, పీపీ కృష్ణప్రసన్న, న్యాయవాదులు యేచూరి శ్రీనివాస్‌, కొంక వెంకన్న, లింగంపల్లి అంజయ్య, ఉమాశంకర్‌రెడ్డి, కుమార్‌రెడ్డి, శ్రీదేవి, రాములు, డీఎస్పీ వెంకటేశ్వరరావు, సీఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. పట్టణంలోని మసీద్‌లో హైకోర్టు న్యాయమూర్తి షమీమ్‌అక్తర్‌  నమాజ్‌ చేశారు. ఈ సందర్భంగా న్యాయమూర్తిని ఆ మసీద్‌ చైర్మన్‌ మహ్మద్‌అలీ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఖాసీం, మౌలానాముగ్దుం మొహినోద్దీన్‌, అఫీజ్‌, అక్తర్‌, గౌసుద్ధిన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-16T06:05:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising