ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆర్టీసీకి దసరా పండుగ

ABN, First Publish Date - 2021-10-20T07:07:55+05:30

దసరా సందర్భంగా ఆర్టీసీ నల్లగొం డ రీజియన్‌లోని పలు డిపోలు రికార్డుస్థాయి ఆదాయాన్ని సాధించాయి.

దేవరకొండ డిపోలో సంబరాలు చేసుకుంటున్న ఆర్టీసీ ఉద్యోగులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రయాణికుల రద్దీతో పెరిగిన ఆదాయం

దేవరకొండ, మిర్యాలగూడ టౌన్‌, అక్టోబరు 19: దసరా సందర్భంగా ఆర్టీసీ నల్లగొం డ రీజియన్‌లోని పలు డిపోలు రికార్డుస్థాయి ఆదాయాన్ని సాధించాయి. ఈ నెల 8వ నుం చి 18వ తేదీ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను సాధారణ చార్జీతో నడిపింది. రద్దీ ఉండే ప్రాంతాలు, ప్రధానంగా హైదరాబాద్‌కు అత్యధిక సంఖ్యలో రీజియన్‌ నుంచి బస్సులు నడిచాయి.  ప్రయాణికుల రద్దీ కారణంగా మిర్యాలగూడ డిపో 11 రోజుల్లో రూ.1.67కోట్ల ఆదాయన్ని సాధించింది. డిపో పరిధిలోని 117 బస్సులు 5.20లక్షల కిలోమీటర్లు ప్రయాణించి రూ.1,67,62,000 ఆదాయాన్ని సమకూర్చాయి. ఇక ఈ నెల 18వ తేదీన ఒక్కరోజే రికార్డు స్థాయిలో రూ.23లక్షల ఆదాయం సమకూరింది. రీజియన్‌లో అత్యధిక ఆదాయం ఆర్జించిన డిపోల్లో మిర్యాలగూడ ద్వితీయస్థానంలో నిలిచింది. రూ.23లక్షలకు మించిన ఆదాయంతో నల్లగొండ డిపో ప్రథమస్థానంలో నిలిచింది. కాగా, దీపావళి, కార్తీక మాసం సందర్భంగా రద్దీకి అనుగుణంగా అదనపు బస్సులు నడిపిస్తామని, 30 మంది ప్రయాణికులు ఉంటే దూర ప్రాంతాలకు సైతం ప్రత్యేక బస్సు ఏర్పాటు చేస్తామని మిర్యాలగూడ డిపో మేనేజర్‌ బొల్లెద్దు పాల్‌, అసిస్టెంట్‌ మేనేజర్‌ సంధ్యారాణి తెలిపారు. దేవరకొండ ఆర్టీసీ డిపో ఈనెల 18న ఒక్కరోజే రూ.20,15,118 ఆదాయాన్ని సాధించింది. దీంతో ఉద్యోగులకు ఆర్టీసీ డిపో సీఐ సైదులు స్వీట్లు పంపిణిచేసి అభినందించారు. 18న డిపో నుంచి బస్సులు 47.31వేల కిలోమీటర్లు తిరిగి, కిలోమీటర్‌కు రూ.42.85 చొప్పున ఆదాయం సాధించాయి.

Updated Date - 2021-10-20T07:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising