ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాసంగిలో వరి వద్దు

ABN, First Publish Date - 2021-12-01T06:55:45+05:30

యాసంగిలో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. పట్టణంలోని ఆర్జాలబావి పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం తనిఖీచేశారు.

ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ధాన్యం తేమశాతాన్ని పరిశీలిస్తున్న కలెక్టర్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రత్యామ్నాయ పంటలు సాగుచేయాలి

కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ 


నల్లగొండ, నవంబరు 30: యాసంగిలో వరి సాగు చేయవద్దని, ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌జీవన్‌ పాటిల్‌ అన్నారు. పట్టణంలోని ఆర్జాలబావి పీఏసీఎస్‌ కొనుగోలు కేంద్రాలను ఆయన మంగళవారం తనిఖీచేశారు. ఈ సం దర్భంగా మాట్లాడుతూ, యాసంగిలో వరికి బదులు లాభదాయకమైన, మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటే పంటల సాగుపై దృష్టి సారించాలన్నారు. ఈ మేరకు వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో రైతులకు గ్రామస్థాయిలో అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. యాసంగి లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఉండవన్నారు. వేరుశనగ, పెసర్లు, నువ్వులు, బొబ్బర్లు, మినుములు సాగుచేయాలన్నారు. ఓపెన్‌ మార్కెట్‌లో లభించే ఆముదం, ఆవాలు, కూరగాయల సాగుపై రైతులకు వ్యవసాయ అధికారులు సూచనలు అందజేయాలన్నా రు. ఆయిల్‌పాం సాగుకు ప్రభుత్వం ప్రోత్సాహం కల్పిస్తోందన్నారు. వానాకాలం సీజన్‌లో జిల్లాలో 239 కొనుగోలు కేంద్రాల ద్వారా ఇప్పటి వరకు 1.50లక్ష మెట్రిక్‌ టన్నుల ధాన్యాన్ని 22,333 రైతుల నుంచి కొనుగోలు చేశామన్నారు. ఈ మేరకు రైతు ఖాతాల్లో రూ.84కోట్లు జమ చేశామన్నారు. కొనుగోలు కేంద్రాల్లో వ్యవసాయ విస్తరణ అధికారు లు అందుబాటులో ఉండాలన్నారు.


ఆధార్‌తో ఫోన్‌ నంబర్‌ను అనుసంధానం చేసుకోవాలి

రైతులు ఆధార్‌ కార్డుకు ఫోన్‌ నెంబర్‌ను అనుసంధానం చేసుకోవాలని కలెక్టర్‌ సూ చించారు. ఓపీఎంఎ్‌సలో రైతు వివరాలు నమోదు చేసినప్పుడు ఫోన్‌ నంబర్‌కు ఓటీపీ వస్తుందన్నారు. ఆర్జాలబావి కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 6వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, యాసంగిలో 14వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం, గత వానాకాలంలో 10వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేసినట్లు తెలిపారు. 90శాతం కోతలు పూర్తయ్యాయని, అందులో 50 శాతం కొనుగోలు చేసినట్లు కలెక్టర్‌కు జిల్లా సహకార అధికారి ప్రసాద్‌ వివరించారు. కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్‌రెడ్డి, పౌరసరఫరాల సంస్థ డీఎం నాగేశ్వర్‌రావు, సహాయ పౌరసరఫరాల అధికారి నిత్యానందం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-01T06:55:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising