గురుకులాలు,వసతి గృహాల్లో ప్రత్యక్ష బోధన
ABN, First Publish Date - 2021-10-21T06:40:31+05:30
కరోనా ప్రభావంతో సుదీర్ఘకాలం తర్వాత సంక్షేమ హాస్టళ్ల్లు, ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు నేటినుంచి తెరుచుకోనున్నా యి. ఆయా విద్యాసంస్థల్లో వసతి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వసతిగృహాలకు చేరుకోనున్నారు.
నేటి నుంచి తరగతులు ప్రారంభం
ఆన్‌లైన్ తరగతులతో నిన్నటివరకు ఇబ్బందులు
ఇకపై ప్రత్యక్ష బోధనకు యంత్రాంగం ఏర్పాట్లు
ఉమ్మడి జిల్లాలో 149 హాస్టళ్లు, 23వేలకు పైగా విద్యార్థులు
64 గురుకులాలు, 45వేల మంది విద్యార్థులు
కరోనా ప్రభావంతో సుదీర్ఘకాలం తర్వాత సంక్షేమ హాస్టళ్ల్లు, ఆశ్రమపాఠశాలలు, గురుకులాలు నేటినుంచి తెరుచుకోనున్నాయి. ఆయా విద్యాసంస్థల్లో వసతి పొందుతున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులు వసతిగృహాలకు చేరుకోనున్నారు. ఇప్పటి వరకు వసతిగృహాలను తెరవకపోవడంతో ఆయా వర్గాలకు చెందిన విద్యార్థులు సుదూర ప్రాంతాలనుంచి పాఠశాలలకు వెళ్లలేకపోయారు. వారు ఇంటివద్దే ఆన్‌లైన్ తరగతులకు పరిమితమయ్యారు. తాజాగా వసతిగృహాలు ప్రారంభం అవుతుండటంతో విద్యార్థులతోపాటు వారి తల్లిదండ్రులు ఊరట చెందారు.
నల్లగొండ, అక్టోబరు 20 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రాష్ట్రంలోని గురుకులాలను తిరిగి తెరిచేందుకు హైకోర్టు బుధవారం గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో అధికార యంత్రాంగం సిద్ధమైంది. గతంలో గురుకులాలను తెరవద్దని ఇచ్చి న ఆదేశాలను తిరిగి న్యాయస్థానం సవరించడం, ఆదేశాలు జిల్లాస్థాయి అధికారులకు అందడంతో గురుకులాలు తెరుచుకోనున్నాయి. రాష్ట్ర ప్రభు త్వం కూడా ఇంటర్ పరీక్షల దృష్ట్యా గురుకులాలను ప్రారంభించేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరిన విషయం తెలిసిందే. విద్యాసంస్థలు, వసతి గృహాల్లో కొవిడ్ నిబంధనలు పాటిస్తామని ప్రభుత్వం పక్షాన ఏజీ హామీ ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో గురుకులాల్లో ప్రత్యక్ష బోధన చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. పాఠశాలలకు వెళ్లకపోతే పాఠాల్లో వెనకబడిపోతామోనన్న ఆయా విద్యార్ధుల్లో నెలకొన్న విషయం తెలిసిందే. కనీసం ఆన్‌లైన్‌పాఠాలు కూడా లేకపోవడంతో ప్రభుత్వ వపతి గృహాల్లో ఉంటూ విద్యనభ్యసించే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల పరిస్ధితి ప్రశ్నార్థకంగా మారింది. దీనికితోడు పిల్లలను పోషించడం భారంగా మారడం, వారి భవిష్యత్ ఏమిటన్న దానిపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హైకో ర్టుగ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంతో ఊరట చెందారు.
ప్రతి విద్యార్థికీ విద్యనందిచాలనే ఉద్ధేశంతో..
పేదరికం చదువుకు ఆటంకం కాకూడదని భావించి ప్రతి విద్యార్థికీ విద్యనందించాలన్న లక్ష్యంతో నిరుపేద కుటుంబంలోని పిల్లలకు కూడా మెరుగైన విద్యనందించేందుకు ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వపతి గృహాలు, ఆశ్రమపాఠశాలలతోపాటు గురుకులాలను ఏర్పాటుచేసింది. ఇం దులో చేరి ఎంతోమంది నిరుపేద విద్యార్థులు విద్యనభ్యసిస్తుండగా కరోనా విజృంభించడంతో పాఠశాలలతోపాటు వసతి గృహాలను అప్పట్లో మూసివేశారు. ప్రస్తుతం కరోనా తగ్గుముఖం పట్టడంతో ప్రభుత్వ పాఠశాలలు, వసతిగృహాలు తెరిచేందుకు సిద్ధమైన నేపథ్యంలో కొందరు కోర్టును ఆశ్రయించడంతో పాఠశాలల నిర్వహణపై మార్గదర్శకాలను విడుదలచేసింది. ఈ క్రమంలో వపతిగృహాలు తెరుచుకోకపోవడంతో విద్యార్థులు ఇళ్లకే పరిమితమయ్యారు. తాజాగా హైకోర్టు నిర్ణయంతో గురుకులాలు తెరిచేందుకు వీలు కలిగింది. కరోనా నేపఽథ్యంలో ప్రభుత్వం పాఠశాలలను మూసివేసినప్పటి నుంచి విద్యార్థులకు ఆన్‌లైన్ విద్యాబోధన సాగింది. ప్రభుత్వం తాజాగా పాఠశాలలను పునఃప్రారంభించి ప్రత్యక్ష విద్యాబోధన ప్రారంభించగా నాటి నుంచి ఆన్‌లైన్ విద్యాభోదన నిలిచిపోయింది. దీంతో పాఠశాలల్లోని విద్యార్థులకు ప్రత్యక్ష బోధన అందుతున్న హాస్టల్ విద్యార్థులు మాత్రం ఇళ్లకే పరిమితం కావాల్సి వచ్చింది. అటు దూర ప్రాంతాలకు వెళ్లలేక.. ఇటు ఆన్‌లైన్ బోధనలేక వారికి భవిష్యత్‌పై భయం పట్టుకుంది. ఇకపై ప్రత్యక్ష బోధన జరగనుండంతో విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది.
గురుకులాల్లో జూమ్ ద్వారా బోధనతో..
గురుకుల పాఠశాల ప్రారంభంపై ప్రభుత్వం నుంచి న్యాయస్థానం నివేదిక కోరడంతో గురుకులాలు, వసతిగృహాలను తెరవకుండా వాయిదావేసింది. దీంతో వేలాదిమంది విద్యార్థులు పాఠశాలలో విద్యనభ్యసిస్తున్న వారితో పోలిస్తే చదువులో వెనుకబడుతున్నారు. వీరికి ప్రత్యేక తరగతులు నిర్వహించేది లేనిది ప్రభుత్వం ఇప్పటివరకు స్పష్టం చేయలేదు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, గురుకుల పాఠశాలల ఉపాధ్యాయులు ప్రత్యేకంగా జూమ్ యాప్ ద్వారా పాఠాలు బోధిస్తూ వస్తున్నారు. కానీ చాలామందికి సెల్‌ఫోన్లు, ట్యాబ్‌లు లేక ఉన్న ఇంటర్నెట్ అందుబాటులో లేకపోవడంతో వినియోగించుకోలేకపోయారు. తాజాగా ప్రభుత్వం గురుకులాలు, వసతిగృహాలను తెరుస్తుండటంతో విద్యా సంవత్సరం వృథా కాకుండా ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాలు 64 ఉండగా, అందులో విద్యార్థులు 45వేల మంది ఉన్నారు.
గురుకులాల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు : సీహెచ్. అరుణకుమారి, ఎస్సీ గురుకులాల కోఆర్డినేటర్
గురుకుల పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించేందుకు రాష్ట్ర హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో గురువారం నుంచి గురుకులాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఇప్పటికే అధ్యాపకులు, ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థు ల తల్లిదండ్రులకు ఈమేరకు సెల్‌ఫోన్లకు మెసేజ్‌లు కూడా పంపాం. కరోనా నిబంధనలకు అనుగుణంగా అన్ని చర్యలు తీసుకుంటున్నాం.
గురుకులాల ప్రారంభం హర్షనీయం : జనార్ధన్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు,నల్లగొండ
ఎట్టకేలకు సుదీర్ఘ విరామం అనంతరం గురుకులాలు, వపతి గృహాలు తెరుచుకోవడం హర్షనీయం. ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాం. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలు ప్రారంభమై చాలా రోజులవుతున్నా హాస్టళ్లు, గురుకులాలు తెరుచుకోకపోవడంతో పేద విద్యార్థులు ఎంతో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనేక ఉద్యమాల అనంతరం ప్రభుత్వం సానుకూలంగా స్పందించడం ద్వారా పేద విద్యార్థులకు ఎంతో మేలు జరుగుతుంది.
ఉమ్మడి జిల్లాలో వసతి గృహాలు, విద్యార్థుల వివరాలు ఇలా
సామాజిక వసతి విద్యార్థుల
వర్గం గృహాల సంఖ్య సంఖ్య
ఎస్సీ 122 13,970
బీసీ 92 10,610
ఎస్టీ 84 22,596
మొత్తం 298 47,176
Updated Date - 2021-10-21T06:40:31+05:30 IST