యాదాద్రిక్షేత్రంలో భక్తుల ‘కార్తీక’ పూజలు
ABN, First Publish Date - 2021-11-21T05:04:51+05:30
యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం కార్తీక పూజల సందడి నెలకొంది.
యాదాద్రి టౌన్, నవంబరు 20: యాదా ద్రి లక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో శనివారం కార్తీక పూజల సందడి నెలకొంది. కొండకింద తులసీకాటేజ్‌లోని కల్యాణకట్టలో మొక్కుతలనీలాలు సమర్పించుకున్న యా త్రాజనులు స్వామివారి దర్శనాలకోసం కొం డపైకి చేరుకున్నారు. హరిహరుల దర్శనా లు.. ఆర్జిత సేవల నిర్వహణకోసం క్యూలైన్ల్ల లో బారులుతీరారు. భక్తుల సంచారంతో ఆల య మండపాలు, తిరువీధులు సందడిగా మారాయి. కొండకింద పాత గోశాలలో సత్యనారాయణస్వామి వ్రతపూజల్లో భక్తులు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు. తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచిన యాదాద్రిక్షేత్రంలో 561మంది దంపతులు వ్రతపూజల్లో పాల్గొన్నారు. వ్రతపూజల అనంతరం భక్తజనులు కుటుంబ సమేతంగా కొండపై న హరిహరులను దర్శించుకుని మొ క్కులు సమర్పించుకున్నారు. ఇదిలా ఉండగా ఉదయం కురిసిన వర్షంతో యాత్రీకులు ఇబ్బందులకు గురైయ్యారు. వర్షంలో గొడుగు లు చేతపట్టుకుని ఇష్టదైవాలను దర్శించుకున్నారు. స్వామి కి వివిధ విభాగాల ద్వారా రూ.15,46,879 ఆదాయం సమకూరినట్లు దేవస్థాన అధికారులు తెలిపారు.
స్వామికి ఘనంగా నిత్య కైంకర్యాలు
యాదాద్రీశుడికి నిత్యవిధి కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వయంభువులను సుప్రభాతంతో మేల్కొలిపిన అర్చకులు బాలాలయంలోని కవచమూర్తులను ఆరాధించా రు. ఉత్సవమూర్తులకు అభిషేకం, అర్చనలు చేసి సుదర్శన శతక పఠనంతో హోమం, నిత్య కల్యాణపర్వాలు ఆగమశాస్త్రరీతిలో నిర్వహించారు. బాలాలయంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు కొనసాగాయి. యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామిని శనివారం ప్రముఖ సినీ నటుడు సుదీప్ దర్శించుకొని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
బంగారు తాపడానికి విరాళం అందజేత
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ప్రధానాలయ విమాన గోపురం బంగారు తాపడంకోసం శనివారం గుట్ట మునిసిపల్ కౌన్సిలర్ తాళ్లపల్లి నాగరాజు రూ.52,116 విరాళాన్ని దేవస్థాన అధికారులు అందజేశారు. బాలాలయంలో కవచమూర్తులను దర్శించుకున్న అనంతరం ఉత్సవమూర్తుల చెంత విరాళం చెక్కును దేవస్థాన ఏఈవోలు గజ్వేల్ రమేశ్‌బాబు, గట్టుశ్రవణ్‌కుమార్‌లకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యా దాద్రీశుడి ఆలయ పునర్నిర్మాణంలో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నాని తెలిపారు.
Updated Date - 2021-11-21T05:04:51+05:30 IST