ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ధాన్యం డబ్బుల చెల్లింపుల్లో కోత

ABN, First Publish Date - 2021-07-25T05:37:01+05:30

తాము అమ్మిన ధాన్యం కంటే తక్కువగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయన్నాయని గుర్తించిన రైతులు నాంపల్లి మండలకేంద్రంలోని పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట శనివారం అర్ధనగ్న ఆందోళనకు దిగారు.

అర్ధనగ్నంగా నిరసన తెలపుతున్న రైతులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యాయం చేయాలని రైతుల అర్ధనగ్న ఆందోళన

నాంపల్లి, జూలై 24: తాము అమ్మిన ధాన్యం కంటే తక్కువగా డబ్బులు అకౌంట్లలో జమ అవుతాయన్నాయని గుర్తించిన రైతులు నాంపల్లి మండలకేంద్రంలోని  పీఏసీఎస్‌ కార్యాలయం ఎదుట శనివారం అర్ధనగ్న ఆందోళనకు దిగారు. కారణమైన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. మండలంలోని సుంకిశాల గ్రామనికి చెందిన రైతు నేతళ్ళ ఇంద్రమ్మ పీఏసీఎస్‌లో క్వింటల్‌కు రూ.1,885ల చొప్పున జూన్‌ 7వ తేదీన 80క్వింటాళ్ల ధాన్యం అమ్మిందని తెలిపారు. మొత్తం రూ.1,54,180లు రావాల్సి ఉండగా, జూలై 20వ తేదీన ఆమె బ్యాంక్‌ అకౌంట్‌లో రూ.1,35,180 మాత్రమే జమ అయ్యాయని తెలిపారు. విషయం తెలుసు కున్న డీటీ స్వప్న రైతులతో మాట్లాడారు. ఉన్నతాధికారులతో మాట్లాడి న్యాయం చేసేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు నేతళ్ళ ఇంద్రమ్మ, నేతళ్ళ రాములు, నారోజు రామచారి, మేగావత్‌ రాములు, కొత్తగొల్ల రాములు, యాదయ్య, మల్లయ్య  పాల్గొన్నారు.

Updated Date - 2021-07-25T05:37:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising