ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మైనార్టీల రక్షణకు కట్టుబడిన కాంగ్రెస్‌

ABN, First Publish Date - 2021-03-06T05:53:35+05:30

మైనార్టీల రక్షణకు కాంగ్రె్‌స పార్టీ కట్టుబడి ఉందని నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

మిర్యాలగూడలో సమావేశంలో మాట్లాడుతున్న టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి

మిర్యాలగూడ, మార్చి 5: మైనార్టీల రక్షణకు కాంగ్రె్‌స పార్టీ కట్టుబడి ఉందని నల్లగొండ పార్లమెంట్‌ సభ్యుడు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఎమ్మెల్సీ ప్రచారంలో భాగంగా శుక్రవారం మిర్యాలగూడలో నిర్వహించిన మైనార్టీల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. మోదీ ప్రభుత్వం మైనార్టీలను లక్ష్యం చేసుకుందన్నారు. సీఏఏ చట్టం, తినే ఆహారపదార్థాలపై కూడా వ్యాఖ్యలు చేస్తూ ముస్లింలపై వివక్ష చూపుతోందన్నారు. బీజేపీ, టీఆర్‌ఎ్‌స రహస్య ఒప్పందం మేరకు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తిలా పనిచేస్తున్నాయని చెప్పారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నిక, పెద్దనోట్ల రద్దు, ట్రిపుల్‌ తలాక్‌, 370 ఆర్టికల్‌ రద్దు, జీఎస్టీ, సాగుచట్టాల విషయంలో ఒప్పందం మేరకే మోదీతో కేసీఆర్‌ అంటకాగుతున్నారని అన్నారు. సోనియాగాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌ పార్టీ సామాజిక న్యాయం పాటిస్తూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడి పనిచేస్తోందన్నారు. పేద గిరిజన నాయకుడైన రాములు నాయక్‌ను ఎమ్మెల్సీ బరిలోకి దింపి గిరిజనులు, మైనార్టీలపై ఉన్న ప్రేమను కాంగ్రెస్‌ చాటిందన్నారు. టీఆర్‌ఎస్‌ అన్యాయాలపై చట్టసభలో పోరాడేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలో రాములు నాయక్‌కు మొదటి ప్రాధాన్య ఓటువేసి గెలిపించాలని కోరారు. అంతకుముందు మిర్యాలగూడ మండలం లక్ష్మిపురం గ్రామంలో మృతిచెందిన పెద్దరాంరెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డీసీసీ ప్రెసిడెంట్‌ శంకర్‌నాయక్‌, మునిసిపల్‌ ఫ్లోర్‌లీడర్‌ బత్తుల లక్ష్మారెడ్డి, ముదిరెడ్డి నర్సిరెడ్డి, నూకల వేణుగోపాల్‌రెడ్డి, చిలుకూరి బాలకృష్ణ, పగిడి రామలింగయ్యయాదవ్‌, అలుగుబెల్లి అమరేందర్‌రెడ్డి, చిరుమర్తి కృష్ణయ్య, కౌన్సిలర్లు దేశిడి శేఖర్‌రెడ్డి, గంధం రామకృష్ణ, మంత్రాల రుణాల్‌రెడ్డి, రవినాయక్‌, కొమ్ము నాగలక్ష్మి, రమే్‌షనాయక్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-06T05:53:35+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising