ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

యాదాద్రిలో జయంతి వేడుకలకు శ్రీకారం

ABN, First Publish Date - 2021-05-24T06:08:02+05:30

యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి పుణ్యక్షేత్రంలో అర్చకుల వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య జయంతోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు.

బాలాలయంలో తిరువేంకటపతి అలంకార సేవోత్సవం నిర్వహిస్తున్న అర్చకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 స్వస్తివాచనం, విశ్వక్సేనారాధన, లక్షపుష్పార్చన
 ఉదయం తిరువేంకటపతిగా.. రాత్రి పరవాసుదేవుడిగా దివ్యదర్శనం

యాదాద్రి టౌన, మే 23 : యాదగిరిగుట్ట లక్ష్మీనారసింహుడి పుణ్యక్షేత్రంలో అర్చకుల వేదమంత్ర పఠనాలు, మంగళవాయిద్యాల మధ్య జయంతోత్సవాలకు ఆదివారం శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా బాలాలయ మండపంలో పంచామృత కళశాలకు, దర్భ(గరక)లతో, వేదమంత్రోచ్ఛారణలతో పూజలు నిర్వహించారు. ఉత్సవ నిర్వహణ నిర్విగ్నంగా కొనసాగడానికి విశ్వక్సేనుడికి తొలి పూజలు చేశారు. ముందుగా ఉత్సవమూర్తులకు నిజాభిషేకం చేసి అర్చించారు. అనంతరం పుణ్యవచన మంత్ర జలాలతో బాలాలయం, పరిసరాలు, కొండపై నలుదిక్కులా పవిత్రీకరించారు. బాలాలయ మండపంలో లక్ష్మీసమేతుడైన నారసింహుడి ప్రత్యేకంగా అలంకరించి వేదికపై అధిష్ఠింపజేశారు. ఉత్సవ ప్రారంభ ప్రాధాన్యతతో చతుర్వేదములు, ఉపనిషత్తులు, పంచసూక్తములు, శ్రీ సుదర్శన శతక, రామాయణ భాగవతాలను క్షేత్ర మహాత్యాన్ని, మూలమంత్ర జపాలను వేద పండితు లు, ఆలయ అర్చకులు పఠనం చేశారు.  విశేష పర్వాలను దేవస్థాన ప్రధానార్చకులు నల్లందిఘల్‌ నర్సింహాచార్యులు, మరింగంటి మోహనాచార్యులు, అర్చక బృందం ఆగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. ఆలయ అనువంశిక ధర్మకర్త బి.నర్సింహమూర్తి, ఈవో గీతారెడ్డి, అధికారులు పాల్గొన్నారు.  ఉత్సవాలో భాగంగా నారసింహుడు కొలువుదీరిన గర్భాలయంలో అర్చక బృందం ఆస్థానపంగా ఆరాధనలు చేశారు.
లక్ష్మీనారసింహులకు లక్ష పుష్పార్చనలు
నృసింహ జయంత్యుత్సవాల్లో తొలిరోజు స్వామివారిని లక్షపుష్పాలతో అర్చించారు. విశ్వశాంతి, లోక కల్యాణార్థం సర్వజనులు సుఖసంతోషాలతో విరాజిల్లాలని కోరుతూ బాలాలయ మండపంలో ఉత్సవమూర్తులను దివ్యమనోహరంగా అలంకరించి లక్ష నామాలను జపి స్తూ ప్రత్యేక వేదికపై తీర్చిదిద్దారు. స్వామి అమ్మవార్ల సహస్రనామ పఠనాలతో వివిధ రకాల పూలతో లక్షపుషార్చన పూజలు చేశారు. అయితే ప్రతి ఏకాదశి పర్వదినం రోజున లక్ష్మీనృసింహుడికి లక్షపుష్పాలతో అర్చించడం ఆలయ సంప్రదాయం. జయంతి ఉత్సవాల్లో తొలిరోజు ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ విశేష పర్వాలను, అర్చక, అధికార బృందం ఆస్థానపరంగా నిర్వహించారు.
తిరువేంకటపతి అలంకార సేవ
నృసింహుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు స్వా మిని దశావతారాల్లో, వివిధ వాహన సేవల్లో అలంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. జయంతి ఉత్సవాల్లో తొలిరోజు ఆదివారం స్వామివారిని తిరువేంకటపతి అలంకరణలో అలంకరించి బాలాలయంలో వేదమంత్ర పఠనాలు, మంగళవాయిధ్యాల నడుమ ఊరేగింపు నిర్వహించారు. కలియుగ వైకుంఠవాసుడిగా ప్రసిద్ధిగాంచిన తిరువేంకటపతి అలంకరణలో లక్ష్మీనృసింహుడి సేవోత్సవం నిర్వహించడం విశేషమైనదని, పరమాత్ముడు భిన్న రూపాల్లో దర్శనమిచ్చి భక్తజనులను రక్షిస్తున్నాడని, ఎన్నో నిదర్శనములను చూపించే యాదాద్రి పంచనారసింహుడు తిరువేంకటపతిగా భక్తులకు దర్శనమివ్వడం ఉత్సవ ప్రత్యేకతను, అలంకార సేవ విశిష్టతను ఆచార్యులు వివరించారు.
అంకురార్పణ
స్వామివారి జయంత్యుత్సవాల్లో ఆదివారం సాయంత్రం అంకురార్పణ, మత్స్యంగ్రహణ పూజలు సంప్రదాయరీతిలో నిర్వహించారు. ముందుగా పుట్ట మట్టికి ప్రత్యేక పూజలు నిర్వహించి నవధాన్యాలను నిర్దేశించిన వేద మంత్రాలతో పవిత్రీకరించి తడిపి మొలకెత్తించే కార్యక్రమమే అంకురార్పణ. భూమిపై గల క్షేత్రాలు పచ్చని పంటలతో సస్యశ్యామలంగా వర్ధిల్లింపజేయడానికి భగవంతున్ని అనుగ్రహింప చేయడానికి ఈ అంకురార్పణం కార్యక్రమం నిర్వహణ ఉద్దేశమని ఆలయ ప్రధానార్చకులు తెలిపారు. 
పరవాసుదేవుడిగా లక్ష్మీనృసింహుడు
యాదాద్రీశుడి జయంతి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి స్వామివారిని పరవాసుదేవుడిగా అలంకరించి గరుఢవాహనంపై విహరింపజేశారు. బాలాలయ మండపంలో లక్ష్మీనృసింహుడిని పట్టువసా్త్రలు, బంగారు, ము త్యాల ఆభరణాలతో దివ్యమనోహరంగా అలంకరించి వైకుంఠనాధుడి వాహనమైన గరుత్మంతుడి వాహనంపై అధిష్టింపజేశారు. వేద మంత్ర పఠనాలు, మంగళవాయిధ్యాల నడుమ అలంకార సేవను బాలాలయంలో ఊరేగించారు. నిరంతరం భక్తజన, ధర్మ పరిరక్షణ తీరును నిత్య సూరులు ఎల్లవేళ లా దర్శించి ఆనందించే స్వరూపమే పరవాసుదేవ తత్వమని, జయంతి ఉత్సవాల్లో స్వామివారు పరవాసుదేవుడిగా గరుఢవాహనంపై భక్తులను ఎల్లవేళలా తరింపజేస్తారని ఆచార్యులు అలంకార సేవ విశిష్టతను వివరించారు.
పాతగుట్టలో 
యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధ ఆలయమైన పాతగుట్ట లక్ష్మీనృసింహ స్వామి ఆలయంలో నృసింహ జయంతి వేడుకలు ఆదివారం సంప్రదాయరీతిలో కొనసాగాయి. ప్రధానాలయంలోని స్వయంభువులను ఆరాధించిన అర్చకులు మండపంలో ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై అధిష్టింపజేశారు. అర్చకబృందం, వేదపండితులు విశ్వక్సేనుడికి తొలిపూజలతో జయంతి మహోత్సవాలకు శ్రీకారం చుట్టి స్వస్తి పుణ్యాహవచన పూజలు నిర్వహించారు. పుణ్యవాచన జలంతో ఆలయ ం, పరిసరాలను సంప్రోక్షించారు. అనంతరం లక్ష పుష్పార్చన పూజలు జరిపారు. సాయంత్రం అంకురారోపణ, మృత్సంగ్రహణం, మూలమంత్ర హవనం, నీరాజన మంత్రపుష్ప పఠనం కొనసాగింది.
ఏకాంతంగా జయంతి ఉత్సవాలు
కరోనా వైరస్‌ ప్రభావం, లాక్‌డౌనతో నారసింహుడి జయంతోత్సవాలు ఈ ఏడాది సైతం ఏకాంతంగా, నిరాడంబరంగా కొనసాగుతున్నాయి. లాక్‌డౌనతో ఆలయంలోకి భక్తుల రాకను నిలిపివేశారు. దీంతో ఈ ఏడు సైతం భక్తుల సందడి లేకుండానే జయంతి మహోత్సవాలు కొనసాగుతున్నాయి.
కొనసాగుతున్న                            ఆనలైన సేవలు
యాదాద్రి క్షేత్రంలో మూడు రోజుల పాటు కొనసాగనున్న నృసింహ జయంతి మహోత్సవాల సందర్భంగా సుదర్శన హోమం, నిత్యతిరుకల్యాణోత్సవ పర్వాలను నిలిపివేశారు. అయితే భక్తులు ఆనలైన ద్వారా నిజాభిషేకం, పుష్పార్చన, తదితర సేవలు కొనసాగుతున్నాయి. అదే విధంగా జయంతి వేడుకల్లో భాగంగా నిర్వహించే లక్ష పుష్పార్చన, లక్ష కుంకుమార్చన, సహస్రఘటాభిషేకం పూజలను ఆనలైనలో నమోదు చేసుకున్న భక్తుల పేరిట సంకల్ప పూజలు నిర్వహించి సేవోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. అదేవిధంగా యాదాద్రి క్షేత్రంలో నమ్మాళ్వార్‌ తిరునక్షత్ర వేడుకలు ఆదివారం సాయంత్రం వేళ సంప్రదాయ రీతిలో ఆరంభమయ్యాయి. మూడు రోజుల పాటు తిరునక్షత్ర వేడుకలు ఆగమ శాస్త్రం ప్రకారం కొనసాగుతాయి. బాలాలయ మండపంలో ఆళ్వార్లకు స్నపన తిరుమంజనాలు నిర్వహించిన అర్చకులు ప్రత్యేక సేవలో తీర్చిదిద్దారు. దివ్యప్రభద వేదపారాయణాలతో ప్రత్యేక పూజలు జరిపారు.

Updated Date - 2021-05-24T06:08:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising