ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దక్షిణ తెలంగాణాపై సీఎం శీతకన్ను

ABN, First Publish Date - 2021-07-25T06:44:25+05:30

దక్షిణ తెలంగాణాపై సీఎం కేసీఆర్‌ శీతకన్ను పెట్టారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు.

విలేకరులతో మాట్లాడుతున్న కోమటిరెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి


నార్కట్‌పల్లి, జూలై 24: దక్షిణ తెలంగాణాపై సీఎం కేసీఆర్‌ శీతకన్ను పెట్టారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. నల్లగొండ జిల్లా నార్కట్‌పల్లిలో విలేకరులతో ఆయన శనివారం మాట్లాడారు. వేల కోట్ల రూపాయలు వెచ్చించి ఉత్తర తెలంగాణాలోని కొత్త నీటి ప్రాజెక్టులను పూర్తిచేస్తూ వందల కోట్లతో పూర్తయ్యే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టులపై సీఎం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారన్నారు. 90 శాతం పనులు పూర్తయిన బీ.వెల్లెంల ఉదయ సముద్రం ప్రాజెక్టుకు మిగిలిన 10 శాతం పనుల పూర్తికి నిధులు మంజూరు చేయించలేని అసమర్థ మంత్రి జగదీ్‌షరెడ్డి అని ఆరోపించారు. యువరాజు పుట్టినరోజని ఎమ్మెల్యేలను, పోలీసులను వెంటేసుకుని బీ.వెల్లెంల ప్రాజెక్టు వద్ద మొక్క నాటిన మంత్రికి ఆ ప్రాజెక్టు పూర్తికి కావల్సిన నిధులను మంజూరు చేయించే చిత్దశుద్ధి లేదన్నారు. ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకుని పూర్తిచేయిస్తానని ఎన్నికల్లో ఇచ్చిన హామీ ఏమైందో సీఎం కేసీఆరే చెప్పాలని ప్రశ్నించారు. ఆయన వెంట కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు బత్తుల ఊశయ్యగౌడ్‌, కేతేపల్లి ఎంపీపీ శేఖర్‌, ఎల్లారెడ్డిగూడెం ఉపసర్పంచ్‌ వడ్డే భూపాల్‌రెడ్డి, సిగ విష్ణు, జెరిపోతుల భరత్‌, కేతేపల్లి పీఏసీఎస్‌ చైర్మన్‌ బోళ్ల వెంకట్‌రెడ్డి తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-07-25T06:44:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising