ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఇచ్చిన మాట నెరవేర్చిన సీఎం

ABN, First Publish Date - 2021-06-15T07:10:49+05:30

యాదాద్రి అభివృద్ధిలో భాగంగా రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే బాధితులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నెరవేర్చారని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం గుట్టలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 34 మంది బాధితులకు స్థానిక ఆర్టీసీ డిపోలో ఒకొక్కక్కరికి 200 గజాల స్థలం పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం దుకాణాలు, ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన చెందగా సీఎం కేసీఆర్‌ ఎంతో భరోసా ఇచ్చారన్నారు.

గుట్టలో రోడ్డు విస్తరణ బాధితులకు ఇళ్ల పట్టా సర్టిఫికెట్‌ అందజేస్తున్న ప్రభుత్వ విప్‌ సునీత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యాదాద్రి రూరల్‌, జూన్‌, 14: యాదాద్రి అభివృద్ధిలో  భాగంగా రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయే బాధితులకు సీఎం కేసీఆర్‌ ఇచ్చిన మాటను నెరవేర్చారని  రాష్ట్ర ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి అన్నారు. సోమవారం గుట్టలో రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన 34 మంది బాధితులకు స్థానిక ఆర్టీసీ డిపోలో ఒకొక్కక్కరికి 200 గజాల  స్థలం పట్టా సర్టిఫికెట్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మూడేళ్ల క్రితం  దుకాణాలు, ఇళ్లు కూల్చివేస్తున్నారని బాధితులు ఆందోళన చెందగా సీఎం కేసీఆర్‌ ఎంతో భరోసా ఇచ్చారన్నారు. సీఎం హామీ మేరకు ఇళ్లు కోల్పోయిన వారికి ఆర్టీసీ డిపోలో ఒకొక్కరికి 200 గజాల స్థలాన్ని ఇచ్చామన్నారు.  దుకాణాలు కోల్పోయినవారికి నూతన బస్టాండ్‌ వద్ద దుకాణాలు ఇస్తామని ప్రక టించిన సీఎం కేసీఆర్‌ ఆహామీని  నెరవేర్చారన్నారు.  యాదాద్రి అభివృద్ధికి సహకరించిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని, ఎవరూ ఆందోళన చెందవద్దన్నారు. కార్యక్రమంలో ఆర్టీవో భూపాల్‌రెడ్డి, తహసీల్దార్‌ అశోక్‌రెడ్డి, ఆలేరు మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గడ్డమీది రవీందర్‌గౌడ్‌, స్థానిక మున్సిపల్‌ చైర్మన్‌ ఎరుకల సుధాహేమేందర్‌గౌడ్‌, సర్పంచ్‌ ఫోరం మండల అధ్యక్షుడు కర్రె వెంకటయ్య, జడ్పీటీసీ సభ్యురాలు తోటకూరి అనురాధబీరయ్య, మిట్ట వెంకటయ్యగౌడ్‌ పాల్గొన్నారు.



Updated Date - 2021-06-15T07:10:49+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising