ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పాతగుట్ట బ్రహ్మోత్సవాలు పరిసమాప్తి

ABN, First Publish Date - 2021-03-01T06:19:22+05:30

యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి.

పూర్ణకుంభ కలశాన్ని వేదమంత్రోచ్ఛారణల నడుమ తరలిస్తున్న అర్చకులు, అనువంశిక ధర్మకర్త నరసింహమూర్తి, ఈవో గీతారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాస్త్రోక్తంగా అష్టోత్తర శతఘటాభిషేకం

యాదాద్రి టౌన్‌, ఫిబ్రవరి 28: యాదగిరిగుట్ట దేవస్థాన అనుబంధ ఆలయం పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ బ్రహోత్సవాలు పరిసమాప్తి అయ్యాయి. అష్టోత్తర శతఘటాభిషేక పూజలతో వారం రోజులుగా వైభవంగా నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక పర్వాలు ముగిశాయి. ఆదివారం ఉదయం ముందుగా గర్భాలయంలో కొలువైన ఉత్సవమూర్తులను ఆరాధిస్తూ నిత్యారాధన పూజలు చేపట్టారు. ఆలయ మండపంలో 108 కలశాలను ఏర్పాటు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదమంత్రాలు, మంగళవాయిద్యాలతో స్వయంభు లక్ష్మీనరసింహులకు అష్టోత్తర శత కలశాలతో అభిషేక పూజలు నిర్వహించారు. వారం రోజులుగా వివిధ విశేష సేవలో భక్తులను అనుగ్రహించిన స్వామి సన్నిధిలో ఉత్సవాలకు విచ్చేసిన బ్రహ్మాదిదేవతలను తిరిగి స్వస్థలాలకు పంపే దేవతోద్వాసన పర్వాలను నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల ఏకాంత సేవ, శృంగార డోలోత్సవం కార్యక్రమాలను ఆదివారం రాత్రి సంప్రదాయరీతిలో నిర్వహించారు. ఈ ఆధ్మాత్మిక పర్వాలను యాదాద్రి దేవస్థాన ప్రధానార్చకుడు కారంపూడి నరసింహాచార్యులు, అర్చకబృందం, వేదపండితులు, రుత్వికులు నిర్వహించగా, దేవస్థాన అనువంశిక ధర్మకర్త బి.నరసింహమూర్తి, ఈవో ఎన్‌.గీతారెడ్డి పాల్గొన్నారు.


భక్తజనసంద్రం.. యాదాద్రి క్షేత్రం 

యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి పుణ్యక్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మేడారం జాతర కొనసాగుతుండడం, వారాంతపు సెలవు రోజుకావడంతో వివిధ ప్రాంతాల నుంచి యాత్రాజనులు పెద్దసంఖ్యలో క్షేత్ర సందర్శనకు తరలివచ్చారు. హరిహరుల నామస్మరణలతో క్షేత్రం ఆధ్యాత్మికతను సంతరించుకుంది. బాలాలయంలో సువర్ణ పుష్పార్చన, అష్టోత్తరాలు, అలంకార సేవోత్సవాల్లో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు.  వివిధ విభాగాల ద్వారా రూ.20,37,174 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 

Updated Date - 2021-03-01T06:19:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising