సెలవులో చెర్వుగట్టు దేవస్థాన ఈవో?
ABN, First Publish Date - 2021-01-28T06:07:01+05:30
చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈవో అన్నెపర్తి సులోచన సెలవుల్లో వెళ్లేందుకు దారితీశాయి.
నార్కట్‌పల్లి, జనవరి 27: చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు ఈవో అన్నెపర్తి సులోచన సెలవుల్లో వెళ్లేందుకు దారితీశాయి. ఈ నెల 23 నుంచి 3 రోజుల పాటు అధికారికంగా సెలవులో ఉన్న సులోచన 26న విధులకు హాజరుకావాల్సి ఉంది. కానీ హాజరు కాకపోగా తన సెలవును ఫిబ్రవరి 24 వరకు పొడిగించుకున్నట్లు సమాచారం. వచ్చే నెలలో దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల దృష్ట్యా సులోచన స్థానంలో ఇదే కేడర్‌లో ఉన్న మరో ఉద్యోగికి ఇన్‌చార్జిగా బాధ్యతలు ఇవ్వనున్నట్లు తెలిసింది.
Updated Date - 2021-01-28T06:07:01+05:30 IST