ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గంజాయి సాగు చట్ట విరుద్ధం: ఎస్పీ

ABN, First Publish Date - 2021-10-25T05:32:11+05:30

గంజాయి సాగు చట్టవిరుద్ధమని ఎస్‌పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. హుజూర్‌నగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో గం

హుజూర్‌నగర్‌లో మాట్లాడుతున్న ఎస్‌పీ రాజేంద్రప్రసాద్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హుజూర్‌నగర్‌ , అక్టోబరు 24 : గంజాయి సాగు చట్టవిరుద్ధమని ఎస్‌పీ రాజేంద్రప్రసాద్‌ అన్నారు. హుజూర్‌నగర్‌లోని సర్కిల్‌ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లాలో గంజాయి రవాణా, నిందితుల అరెస్టు వివరాలను వెల్లడించారు. గరిడేపల్లి మండలం కట్టవారిగూడెంలో పఠాన్‌ మస్తాన్‌సాబ్‌, షేక్‌ ఖాదర్‌ తమ ఇంటి వెనకాల పెరడులో గంజాయి సాగుచేస్తున్నట్లు తెలిపారు. గ్రామస్థుల సమాచారంతో ఎస్‌ఐ కొండల్‌రెడ్డి మస్తాన్‌ ఇంటి వెనుక పెరుడులో 1.5 కేజీల గంజాయి మొక్కలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశారన్నారు. ఇదిలా ఉండగా పఠాన్‌ మస్తాన్‌ కొన్నేళ్లుగా గం జాయి సేవిస్తున్నాడని, ఇతరులకు కూడా గంజాయి విక్రయిస్తున్నా డన్నారు. కాగా మస్తాన్‌ ఆరోగ్యం బాగా లేకపోతే విజయవాడలోని ఒక స్వామీజీ గంజాయి సేవిస్తే ఆరోగ్యం కుదుట పడుతుందని చెప్పగా దాంతో ఇంటి వెనక గల పెరడులో కొన్నేళ్లుగా గంజాయి సాగు చేస్తూ అతడు సేవిస్తూ ఇతరులకు సరఫరా చేస్తున్నట్లు తెలిపారు. అతడితో పాటు షేక్‌ ఖాదర్‌ కూడా గంజాయికి అలవాటుపడి మస్తాన్‌ ఊరులో లేని సమయంలో సాగు పనితో పాటు సరఫరా  చేస్తున్నాడని తెలిపారు. దీంతో ఇరువురిపై  కేసు నమోదుచేసి రిమాండ్‌ చేసినట్లు తెలిపారు. సమావేశంలో డీఎ్‌సపీ రఘు, సీఐ రామలింగారెడ్డి, ఎస్‌ఐలు కట్టా వెంకటరెడ్డి, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-25T05:32:11+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising