ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రశాంతంగా కొనసాగుతున్న ఇంటర్‌ పరీక్షలు

ABN, First Publish Date - 2021-10-29T06:07:42+05:30

ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం మ్యాథ్స్‌ పేపర్‌-1బి, జువాలజి, హిస్టరీ పరీక్షలు జరిగాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 58పరీక్ష కేంద్రాల్లో 16,892 మంది విద్యార్థులు హాజరుకా

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నేడు, రేపు పరీక్షలకు విరామం

నల్లగొండ క్రైం, అక్టోబరు 28: ఇంటర్మీడియట్‌ ప్రథమ సంవత్సరం వార్షిక పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి. గురువారం మ్యాథ్స్‌ పేపర్‌-1బి, జువాలజి, హిస్టరీ పరీక్షలు జరిగాయి. నల్లగొండ జిల్లావ్యాప్తంగా 58పరీక్ష కేంద్రాల్లో 16,892 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా 15,968 మంది హాజరయ్యారు. 924మంది గైర్హాజరయ్యారు. జనరల్‌ విభాగంలో 14,235 మందికి 13,556 మంది హాజరుకాగా 679మంది గైర్హాజరు కాగా ఒకేషనల్‌ విభాగంలో 2657 మందికి 2412 మంది హాజరుకాగా 245 మంది గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాలను డీఐఈవో దస్రునాయక్‌ తనిఖీ చేశారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నిక నేపథ్యంలో ఈనెల 29, 30వ తేదీల్లో ఇంటర్‌ పరీక్షలు నిర్వహించడం లేదని, ఆ పరీక్షల నిర్వహణ తేదీలను ఇంటర్మీడియట్‌ బోర్డు ప్రకటిస్తుందని ఆదివారం ఈ నెల 31వ తేదీన జరిగే పరీక్ష యథావిధిగా జరుగుతుందని డీఐఈవో పేర్కొన్నారు. 

 సూర్యాపేట జిల్లాలో 727మంది గైర్హాజరు

సూర్యాపేట అర్బన్‌ : సూర్యాపేట జిల్లాలో 44 పరీక్షా కేంద్రాల్లో  నాలుగో రోజు గురువారం నిర్వహించిన ఇంటర్‌ మొదటి సంవత్సరం జనరల్‌లో 458, ఒకేషనల్‌లో 269 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. జనరల్‌లో 6,488మందికి 6,030 విద్యార్థులు హాజరయ్యారు. ఓకేషన్‌లో 1,438 మందికి  1,169 విద్యార్థులు హాజరయ్యారు.

ఆదివారం కూడా ఇంటర్‌ పరీక్షలు

మోత్కూరు: మోత్కూరు మండల కేంద్రంలోని ఇంటర్మీడియట్‌ పరీక్షా కేంద్రాల్లో ఆదివారం కూడా పరీక్షలు జరుగుతాయని ప్రభుత్వ జూనియర్‌ కళాశాల పరీక్షాకేంద్రం చీఫ్‌ సూపరింటెండెంట్‌ రాములు తెలిపారు. ఆదివారం ఇంటర్‌ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు భౌతికశాస్త్రం, అర్థశా స్త్రం, ఒకేషనల్‌ కోర్సులకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారని తెలిపారు. 

Updated Date - 2021-10-29T06:07:42+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising