ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అహం వీడాలన్నదే బౌద్ధం ఉద్దేశం

ABN, First Publish Date - 2021-12-07T06:39:41+05:30

నేను అనే అహాన్ని వీడాలన్నదే బౌద్ధమతం ఉద్దేశమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274ఎకరాల్లో నిర్మితమవుతున్న బుద్ధవనం ప్రాజెక్టును ఆయన సోమవారం సందర్శించారు.

బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటిస్తున్న గోరటి వెంకన్న
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బుద్ధవనం మహాద్భుత కట్టడం

ఎమ్మెల్సీ గోరటి వెంకన్న 


నాగార్జునసాగర్‌, డిసెంబరు 6: నేను అనే అహాన్ని వీడాలన్నదే బౌద్ధమతం ఉద్దేశమని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న అన్నారు. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 274ఎకరాల్లో నిర్మితమవుతున్న బుద్ధవనం ప్రాజెక్టును ఆయన సోమవారం సందర్శించారు. బుద్ధుడి పాదాల వద్ద పుష్పాంజలి ఘటించిన అనంతరం బౌద్ధమత విశ్లేషకుడు డాక్టర్‌ ఈమని శివనాగరెడ్డితో కలిసి మహాస్తూపం, స్తూపవనం, జాతక కథల పార్కు, ధ్యానవనం, అవకానా బుద్ధ మ్యూజియాన్ని సందర్శించారు. అనంతరం విజయవిహార్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. ధ్యానం చేయడం వల్ల లోకాన్ని మర్చిపోతామన్నారు. పాపాలు తొలగించుకునేందుకు ఏకైక మార్గం బౌద్ధమని అన్నారు. బుద్ధవనం ప్రాజెక్టు పనులను ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్యపై సీఎం కేసీఆర్‌కు నమ్మకంతో అప్పగించారని అన్నారు. త్వరలో సీఎం కేసీఆర్‌ బుద్ధవనాన్ని సందర్శిస్తారని, ఆయన సూచనల మేరకు మార్పులు చేర్పులుచేసి ప్రారంభోత్సవ తేదీలు ప్రకటిస్తారని తెలిపారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి మల్లేపల్లి లక్ష్మయ్య, ఓఎస్డీ సూధన్‌రెడ్డి, ఎస్‌ఈ క్రాంతిబాబు, శిల్పి శ్యాంసుందర్‌, నరసింహారావు ఉన్నారు.

Updated Date - 2021-12-07T06:39:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising