ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బావ చేతిలో బావమరిది హతం

ABN, First Publish Date - 2021-12-25T06:31:32+05:30

బావ చేతిలో బావమరిది హతమయ్యాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అక్కను తరచూ వేధిస్తుండడంతో ఇరువురి మధ్యన ఘర్షణ

 ఇటుకతో తలపై మోదిన బావ 

 ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి 

తుర్కపల్లి, డిసెంబరు 24: బావ చేతిలో బావమరిది హతమయ్యాడు. ఈ సంఘటన తుర్కపల్లి మండలం మాదాపూర్‌ గ్రామంలో శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎర్రవెల్లి వెంకటేష్‌, మాందాల గ్రామానికి చెందిన కృష్ణవేణితో 11 సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికిదంపతులకు ముగ్గురు కుమారులు ఉన్నారు.  కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడు రోజులుగా భార్యాభర్తలు గొడవపడ్డారు. కృష్ణవేణి భర్త వెంకటేష్‌, ఇంట్లో జరిగిన గొడవ గురించి అత్తగారింట్లో ఉన్న బంధువులకు సమాచారం ఇచ్చాడు. ఈ నేపఽథ్యంలో వెంకటేష్‌  బావమరిది రాచకొండ రమేష్‌(30) మాదాపూర్‌ గ్రామానికి వచ్చాడు. ఇంట్లో జరిగిన గొడవపై ఆరాతీశాడు. మద్యం తాగి తన అక్కను తరచూ వేధిస్తున్నావని బావతో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. బావ వెంకటేష్‌ ఇటుకతో బావమరిది తలపై మోదడంతో అతడికి తీవ్రగాయమైంది. వెంటనే అతడిని చికిత్స అందించేందుకు తుర్కపల్లి పీహెచసీకి తీసుకువచ్చారు. ప్రాథమిక చికిత్స అందిన తర్వాత కొద్దిసేపటికి ఛాతిలో తీవ్రమైన నొప్పి వస్తోందని చెప్పడంతో రమే్‌షను భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కాగా ఈ ఘటనపై ఎటువంటి ఫిర్యాదు చేయలేదు.


Updated Date - 2021-12-25T06:31:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising