ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేయాలి

ABN, First Publish Date - 2021-06-23T06:42:38+05:30

రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేసి నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నాయకులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భువనగిరి రూరల్‌, జూన్‌ 22: రైతులకు బ్యాంకు రుణాలు మాఫీ చేసి నకిలీ, నాసిరకం విత్తనాలను అరికట్టాలని బీజేపీ కిసాన్‌మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఏసిరెడ్డి రాజశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. మంగళవారం కిసాన్‌మోర్చ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతుబంధు డబ్బులను రుణ బకాయి పేరుతో బ్యాంకులు జమ చేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం క్వింటా వరికి రూ.500 అదనంగా అందజేయాలన్నారు. నకిలీ విత్తనాలు, క్రిమి సంహారక మందులు విచ్చలవిడిగా విక్రయి స్తున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదన్నారు. కొనుగోలు చేసిన ధాన్యానికి వెంటనే డబ్బులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఏవో నాగేశ్వరచారికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు నర్ల నర్సింగ్‌రావు, పురుషోత్తంరెడ్డి, పాదరాజు ఉమాశంకర్‌రావు, ఉడుత భాస్కర్‌, భాస్కర్‌రెడ్డి, నర్సింహయాదవ్‌, మల్లేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-06-23T06:42:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising