ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా : గుత్తా

ABN, First Publish Date - 2021-01-24T06:09:12+05:30

విశ్రాంత ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు.

మాట్లాడుతున్న శాసనమండలి చైర్మన్‌ సుఖేందర్‌రెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ కల్చరల్‌, జనవరి 23 : విశ్రాంత ఉద్యోగుల సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. జిల్లాకేంద్రంలోని విశ్రాంత ఉగ్యోగుల సంఘ భవనంలో నూతనంగా నిర్మించిన ఏసీ కాన్ఫరెన్స్‌ హాల్‌ భవనాన్ని ప్రారంభించి మాట్లాడారు. కోవిడ్‌తో  జీవన స్థితిగతులు మారాయని, దీంతో ఆర్థిక పరిస్థితి కొంత దెబ్బతిందన్నారు.  విశ్రాంత ఉద్యోగులకు రావాల్సిన పీఆర్‌సీ, ఇంక్రిమెంట్‌ కోసం కృషి చేస్తానన్నారు. పీఆర్‌సీని ప్రభుత్వం త్వరలో ప్రకటించే అవకాశం ఉందన్నారు. ఎమ్మె ల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ వివిధ శాఖల్లో నిష్ణాతులైన విశ్రాంత ఉద్యోగుల సేవలను తీసుకుంటామన్నారు. పట్టణాభివృద్ధిలో తమ సహకారం కావాలని కోరారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేష్‌, సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దామోదర్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు వెంకట్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీశైలం, నాయకులు పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T06:09:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising