ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గణతంత్ర వేడుకలకు ఏర్పాట్లు పూర్తిచేయాలి : కలెక్టర్‌

ABN, First Publish Date - 2021-01-24T06:07:55+05:30

గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు.

ఏర్పాట్లు పరిశీలిస్తున్న కలెక్టర్‌ పాటిల్‌, ఎస్పీ రంగనాథ్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

నల్లగొండ టౌన్‌ / నల్లగొండ క్రైం, జనవరి 23 : గణతంత్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ ప్రశాంత్‌ జీవన్‌పాటిల్‌ ఆదేశించారు. శనివారం ఆయన ఎస్పీ రంగనాథ్‌, అదనపు కలెక్టర్‌ రాహుల్‌శర్మతో  కలిసి పోలీస్‌ పరేడ్‌గ్రౌండ్‌లో గణతంత్ర వేడుకల ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ కోవిడ్‌ దృష్టిలో ఉంచుకొని ఏర్పాట్లు చేయాలన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో షామియానాలు, వేదిక, సీటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పా ట్లు చేయాలన్నారు. పరేడ్‌గ్రౌండ్‌లో మూడుచోట్ల హ్యాండ్‌ శానిటైజర్లు, మాస్కులు అందుబాటులో ఉంచాలని తహసీల్దార్‌ను ఆదేశించారు. ఉత్తమ ఉద్యోగులు, పల్లె ప్రగతి అవార్డు గ్రహీతలకు మండలం వారీగా సీటింగ్‌ ఏర్పాటు చేయాలన్నారు. వివిధ శాఖల ప్రగతికి సంబంధించి స్టాల్స్‌ ఏర్పాటు చేయాలని, సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి ఆస్తుల పంపిణీ  ఏర్పాట్లు చేయాలన్నారు. డీఈవో విద్యార్థులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నా రు. డీఎంహెచ్‌వో  వైద్యశిబిరం ఏర్పాటు చేయాలన్నారు. ఆయన వెంట ఆర్డీవో జగదీశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీ వో శేఖర్‌రెడ్డి, డీఈవో భిక్షపతి, ఆర్‌డబ్యూఎస్‌ ఎస్‌ఈ మోహన్‌, డీపీఆర్‌వో పాల్గొన్నారు.

Updated Date - 2021-01-24T06:07:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising