ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సరిహద్దుల్లో పకడ్బందీ ఆంక్షలు

ABN, First Publish Date - 2021-05-13T07:26:51+05:30

లాక్‌డౌన కారణంగా ఏపీ, తెలంగాణ సరిహ ద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు ఉదయం 10గంటల నుంచి అనుమతించడంలేదు.

కోదాడ సరిహద్దు వద్ద వాహనాలను అడ్డుకుంటున్న పోలీసులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలను అడ్డుకున్న పోలీసులు
అంబులెన్సలకు అనుమతి
కోదాడరూరల్‌, మే 12:
లాక్‌డౌన కారణంగా ఏపీ, తెలంగాణ సరిహ ద్దుల్లో ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఏపీ నుంచి వచ్చే వాహనాలకు ఉదయం 10గంటల నుంచి అనుమతించడంలేదు. వాహనాలను సరిహ ద్దుల వద్దే నిలిపేస్తున్నారు. అత్యవసర వాహనాలు మినహా వేటికీ అను మతి ఇవ్వడం లేదని పోలీసులు పేర్కొంటున్నారు. కోదాడ మండలం రామాపురం క్రాస్‌రోడ్డు వద్ద ఉదయం 10గంటల తర్వాత వచ్చిన వాహనాలను పోలీసులు అడ్డుకుని ప్రత్యేక పాసులిచ్చి తిరిగి ఆంధ్రాకు పంపారు. ఆరు గంటల నుంచి పది గంటల వరకు మాత్రమే సడలింపు ఉందని ఆ సమయంలోనే ఆంధ్రా నుంచి వచ్చే వాహనాలకు అనుమతి ఉంటుందని రూరల్‌ సీఐ శివరామిరెడ్డి తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజా రవాణాకు ఎటువంటి ఆటంకాలు లేవని ప్రకటించిందని, సరిహ ద్దులో తమను అడ్డుకొని వెనక్కి పంపడం అన్యాయమని ఆంధ్రా నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన కారు యజమానులు పేర్కొన్నారు. ప్రజా రవాణా ఉంటుందని తమకు ఎటువంటి ఆదేశాలు లేవని పోలీసులు వారికి చెప్పారు. ఆంధ్రా నుంచి అంబులెన్సలకు ఆటంకాలు కలిగించ కుండా పంపారు. చెక్‌పోస్టు వద్ద పోలీసు వైద్యశాఖ రెవిన్యూ, రవాణా శాఖ  అధికారులు 24గంటలు ఉండే విధంగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిందని ఆర్డీవో ఎల్‌. కిషోర్‌కుమార్‌ తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో ఆంధ్రా నుంచి  వచ్చే వారు ఈ పాస్‌లు నమోదు చేసుకోవాలని సూచిం చారు. సరిహద్దు వద్ద గూడ్స్‌ వాహనాలతో పాటు ఆక్సిజన సిలిండర్లు, పెట్రోల్‌, డీజిల్‌, ట్యాంకర్లకు ధాన్యం రవాణా మామిడికాయల ఎగుమతి వాహనాలను పంపిస్తామని తెలిపారు. రామాపురం చెక్‌పోస్టును సూర్యా పేట జిల్లా కలెక్టర్‌ వినయ్‌కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన, డిప్యూటీ డీఎంహె చవో నిరంజన  తదితరులు సందర్శించారు. 
అంబులెన్సలను ఆపొద్దు : ఎస్పీ భాస్కరన
ఆంధ్రా నుంచి వచ్చే అంబులెన్సలను చెక్‌పోస్టు వద్ద ఆపొద్దని ఎస్పీ భాస్కరన ఆదేశించారు. అంబులెన్సలతో పాటు మెడికల్‌ పనులపై అనుమతి పొందిన లెటర్‌ ఉంటే వారిని కూడా ఆపొద్దన్నారు. ప్రజా రవాణాకు అనుమతి లేదన్నారు. గూడ్స్‌ వాహనాలతో పాటు ధాన్యం రవాణాకు సంబంధించినవి, ఈ పాస్‌ అనుమతి పొందిన వాహనాలను మాత్రమే అనుమతిస్తామని తెలిపారు. ఆంధ్రా నుంచి పెద్దఎత్తున కార్లు రావడంతో ఎస్పీ వాటిని ఆపారు. హైదరాబాద్‌కు వెళ్లేందకు అనుమతి లేదని, అత్యవసరమైతే ఈ పాస్‌కు నమోదు చేసుకోవాలని సూచించారు. ఆ వాహనాలను వెనక్కి పంపారు. హైదరాబాద్‌ నుంచి ఆంధ్రాకు వెళ్లే వాహనాలను అడ్డుకోవద్దని ఆదేశించారు. ఎస్పీ వెంట సీఐ శివరామిరెడ్డి, ఎస్‌ఐ సైదులు ఉన్నారు.
సరిహద్దులో వాహన తనిఖీలు
దామరచర్ల: నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని వాడపల్లి రాష్ట్ర సరిహద్దు వద్ద పోలీసులు బుధవారం వాహనాలను తనిఖీ చేశారు. 10 రోజులపాటు లాక్‌డౌన విధించడంతో ప్రతి వాహనాన్నీ కుణ్ణంగా తనిఖీ చేశారు. అంబులెన్సుల వివరాలు సేకరించి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన మొదటిరోజు కావటంతో అన్నిరకాల వాహనాలను రాష్ట్రంలోకి అనుమతిస్తున్నారు. లాక్‌డౌన ప్రకటనతో తక్కువ సంఖ్యలో మాత్రమే వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. గ్రామాల్లో నిర్ణీత వ్యవధిలోపే వ్యాపార సముదాయాలు మూసివేస్తున్నారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి.
పాస్‌లున్న వాహనాలకే అనుమతి
నాగార్జునసాగర్‌: ఏపీ-తెలంగాణ సరిహద్దులో ఉన్న నాగార్జునసాగర్‌ ఫైలానకాలనీ కొత్త వంతెన వద్ద ని ర్మానుషంగా మారింది. తెలంగా ణలో ఉదయం 10గంటల వరకే వాహనాల రాకపోకలను అనుమతించడంతో ఏపీ నుంచి వాహనాలు రాలేదు. పాస్‌లు ఉన్న వాహనాలు మాత్రమే ఏపీ నుంచి తెలంగాణ వైపునకు వచ్చాయని సాగర్‌ ఎస్‌ఐ నర్సింహ్మరావు తెలిపారు. లాక్‌డౌనతో నాగార్జునసాగర్‌లోని హిల్‌కాలనీ, ఫైలానకాలనీల్లో ప్రధాన వీధులన్నీ ఉదయం 10గంటలకే నిర్మానుషంగా మారాయి.

Updated Date - 2021-05-13T07:26:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising