ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్రివిద దళాధిపతి బిపిన్‌ రావత్‌కు వినూత్న నివాళి

ABN, First Publish Date - 2021-12-12T04:33:12+05:30

హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌కు జిల్లా కేంద్రం భువనగిరిలో వినూత్నంగా నివాళులర్పించారు. ఉప్పు, సహజ రంగులతో భువనగిరికి చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టిస్ట్‌ ఆవుల వినోద్‌కుమార్‌ గీసిన చిత్రం అందరి మనసులను చలింపజేసింది.

భువనగిరిలో ఉప్పు, 14 రకాల సహజ రంగులతో వేసిన బిపిన్‌ రావత్‌ చిత్రం
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉప్పు, 14 రకాల సహజ రంగులతో రావత్‌ చిత్రం


భువనగిరిటౌన్‌, డిసెంబరు 11: హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన త్రివిధ దళాధిపతి బిపిన్‌ రావత్‌కు జిల్లా కేంద్రం భువనగిరిలో వినూత్నంగా నివాళులర్పించారు. ఉప్పు, సహజ రంగులతో భువనగిరికి చెందిన సామాజిక కార్యకర్త, ఆర్టిస్ట్‌ ఆవుల వినోద్‌కుమార్‌ గీసిన చిత్రం అందరి మనసులను చలింపజేసింది. భువనగిరి ఖిల్లా ఆవరణలోని పర్యాటకశాఖ కార్యాలయంలో సన్న ఉప్పు, 14 రకాల సహజ రంగులతో సుమారు మూడు గంటల పాటు శ్రమించి ఆ చిత్రాన్ని తీర్చిదిద్దారు. హెలికాప్టర్‌ ప్రమాదంలో మృతి చెందిన బిపిన్‌ రావత్‌, ఆయన సతీమణి, మిగతా సైనికాధికారుల జ్ఞాపకంగా రావత్‌ చిత్రపటం చుట్టూ పుష్పాలను అలంకరించారు. చిత్రాన్ని సందర్శించిన వారందరూ ఉద్విగ్నతకు లోనై నివాళులర్పించారు. బిపిన్‌ రావత్‌ దేశ యువతకు స్ఫూర్తిదాయకమని, హెలికాప్టర్‌ దుర్ఘటనలో ఆయన మృతి దేశానికి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, యువకులతో పాటు పలు రంగాలకు చెందిన ప్రముఖులు ఈ సందర్భంగా చిత్ర పటం వద్ద నివాళులర్పించారు.


Updated Date - 2021-12-12T04:33:12+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising