ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కృష్ణా జలాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించాలి

ABN, First Publish Date - 2021-06-21T06:00:20+05:30

కృష్ణా జలాల విషయంలో ప్రభు త్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి నీటి వాటా కోసం సీరియస్‌గా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జూలకంటి రంగారెడ్డి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు రంగారెడ్డి
మిర్యాలగూడ, జూన 20 :
కృష్ణా జలాల విషయంలో ప్రభు త్వం అఖిలపక్ష సమావేశం నిర్వహించి నీటి వాటా కోసం సీరియస్‌గా పోరాడాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జూలకంటి రంగారెడ్డి అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కృష్ణా జలాలపై ఏపీ సీఎం ప్రకటన అన్యాయమని కేసీఆర్‌ ఖం డించడం హర్షనీయమన్నారు. రాష్ట్ర ప్రజల ప్రయోజనాల కోసం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి ఐక్యంగా పోరాడాలని ప్రభు త్వాన్ని కోరారు. ప్రభుత్వం ప్రతి జిల్లాలో వెయ్యి ఎకరాల భూమి ని విక్రయించాలనుకోవడం అన్యాయమన్నారు. డబుల్‌ బెడ్‌రూం ఇళ్లు, ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణాలకు స్థలం దొరకక ఇబ్బందులు పడుతుంటే ఉన్న స్థలాలను అమ్మి అభివృద్ధి చేస్తామనడం దుర్మార్గమన్నారు. అప్పులు తెచ్చి, భూములు అమ్మి రీడిజైన, రీబడ్జెట్ల పేరుతో కమీషన్లకు కక్కుర్తిపడి రాష్ట్ర సంపదనను దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయాల తో ప్రజలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు అనుగుణంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. సమా వేశంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్‌ మల్లేష్‌, రైతుసంఘం నాయకులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, జిల్లా కమిటీ సభ్యులు జగదీష్‌చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-06-21T06:00:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising