ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే చర్యలు : తహసీల్దార్‌

ABN, First Publish Date - 2021-11-28T05:56:52+05:30

ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ సీహెచ్‌.విశాలాక్ష్మి హెచ్చరించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చింతపల్లి, నవంబరు 27: ప్రభుత్వ భూములను ఆక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని తహసీల్దార్‌ సీహెచ్‌.విశాలాక్ష్మి హెచ్చరించారు. మండల కేంద్రంలోని ప్రభుత్వ భూమి సర్వేనెంబర్‌ 154ను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు శనివారం సర్వే చేయించారు. ఈ సందర్భంగా తహసీల్దార్‌ మాట్లాడుతూ గతంలో 154 సర్వేనెంబర్‌లో 9 ఎకరాల భూమిని సర్వేచేసి, గొట్టిముక్కల రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయిన రైతులకు ఇంటి స్థలాలు ఇచ్చినట్లు తెలిపారు. అదేవిధంగా కిష్టరాయన్‌పల్లి రిజర్వాయర్‌ కింద భూములు కోల్పోయే నిర్వాసితుల కోసం అదే సర్వేనెంబర్‌లో 28 ఎకరాల 22 గుంటల భూమిని సర్వేచేసినట్లు పేర్కొన్నారు. 154 సర్వేనెంబర్‌లో భూములు కోల్పోయే రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందిస్తుందని తెలిపారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా ప్రభుత్వ భూములు ఆక్రమిస్తే క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని ఆమె హెచ్చరించారు. ఆమె వెంట డిప్యూటీ తహసీల్దార్‌  ఉమ, దేవరకొండ డివిజన్‌ డిప్యూటీ సర్వే ఇన్స్‌పెక్టర్‌ వంశీ, చింతపల్లి మండల సర్వేయర్‌ రతన్‌లాల్‌ ఉన్నారు.


Updated Date - 2021-11-28T05:56:52+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising