మునిసిపల్ సమావేశంలో ప్రశ్నల వర్షం
ABN, First Publish Date - 2021-01-29T05:32:46+05:30
నల్లగొండ మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు.
రామగిరి, జనవరి 28 : నల్లగొండ మునిసిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశంలో కౌన్సిలర్లు ప్రశ్నల వర్షం కురిపించారు. చైర్మన్ మందడి సైదిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ ఫ్లోర్ లీడర్ బండారు ప్రసాద్ మాట్లాడుతూ మొక్కలు నాటేందుకు అత్యవసర సమావేశం పెట్టడం అవసరమా అని ప్రశ్నించారు. మొక్కలు నాటే ముందు ఆ భూమిలో మొక్కలు ఎదుగుతాయా లేదా అనే ది ఎందుకు చూసుకోలేదన్నారు. పట్టణంలో నాటిన మొక్కలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని పోయాయి అనే లెక్కలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పట్టణంలో మంచినీటి కనెక్షన్లు లీకేజీ అవుతుంటే సిబ్బంది ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. కాంగ్రెస్ ఫ్లోర్ లీడ ర్ బుర్రి శ్రీనివా్‌సరెడ్డి మాట్లాడుతూ ఎస్టీపీ ప్లాంట్‌లో చెట్లు ఎందుకు ఎండిపోయాయి, ముందస్తు చర్యలు ఎందుకు తీసుకోలేక పోయారని అన్నారు. మాస్టర్ ప్లాన్ ఇంకెన్నాళ్లకు తయారు చేస్తారని ప్రశ్నించారు. ప్రకాశం బజారులోని మునిసిపల్ మడిగెల అద్దెలు ఎందుకు వసూలు చేయడం లేదని ప్రశ్నించారు. కొత్తగా కొనుగొలు చేసిన వాహనాలు అప్పుడే ఎందుకు రీపేర్‌కు వచ్చాయని, వాటి నిర్వహణ ఎందుకు చూసుకోవడం లేదని ప్రశ్నించారు. టీఆర్‌ఎస్ ఫ్లోర్ లీడర్ అభిమన్యు శ్రీనివాస్ మాట్లాడుతూ పాతబస్తీలో గృహాలకు ఇంటి నెంబర్ల పక్రియ చేపట్టాలని, ప్రకాశం బాజారు మునిసిపల్ మడిగెల అద్దెలు వసులు చేస్తే ఆదాయం పెరుగుతుందన్నారు. కౌన్సిలర్ కయ్యూమ్ బేగ్ మాట్లాడుతూ రానున్న వేసవిలో మంచినీటి సమస్య రాకుండా చూడాలని కోరారు. లోఓల్టేజీ సమస్యను అధిగమించాలని కోరారు. కౌన్సిలర్ నవీన్‌గౌడ్ మాట్లాడుతూ క్లాక్‌టవర్ సెంటర్‌లో నాలా కబ్జాకు గురవుతుంటే ఏమి చేస్తున్నారని ప్రశ్నించారు. వక్ఫ్‌బోర్డు భూముల్లో నిర్మించుకున్న ఇళ్ల అసిస్మెంట్ చేయాలన్నారు. కమిషసర్ స్పందిస్తూ భారీ వర్షాలతో ఎస్‌టీపీ ప్లాంట్‌లో వేసిన మొక్కలు చనిపోయాయన్నారు. కబ్జాకు గురైన నాలాపై వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. మునిసిపల్ మడిగెల అద్దె విషయంలో కోర్టు కేసు పరిధిలో ఉన్నందున దానిపై మరోసారి పునరాలోచన చేస్తామన్నారు. మునిసిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి మాట్లాడుతూ ఈ సంవత్సరం కరోన కారణంగా అనుకున్న స్థాయిలో అభివృద్ధి చేయలేక పోయామన్నారు. ఈ సంవత్సరం ఎస్సీ, ఎస్టీ, ఎల్‌ఆర్‌ఎస్ నిధులతో వివిధ రకాల అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచామని, వారం రోజుల్లో పనులు మొదలవుతాయన్నారు. ఎస్‌డీఎఫ్ నిధులతో రోడ్ల విస్తరణ, డైనేజీ పనులు చేపడుతామన్నారు. అదేవిధంగా పట్టణంలో ఇంటిగ్రేటెడ్, సూపర్ మార్కెట్లు రెండు నెలల్లో ఏర్పాటు చేయబోతున్నామన్నారు. బతుకమ్మ కు ంటను పర్యాటక కేంద్రంగా మార్చేందుకు డీపీఆర్ తయారు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Updated Date - 2021-01-29T05:32:46+05:30 IST