ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వాగుపై వంతెన నిర్మించాలి

ABN, First Publish Date - 2021-10-18T05:42:02+05:30

మండలంలోని కోడూరు గ్రామానికి వెళ్లే రహదారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని కోడూరు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కోడూరు రహదారి వాగుపై వంతెన నిర్మించాలని వాగులో దిగి గ్రామస్థులు ఆదివారం ని రసన వ్య

వాగులో దిగి నిరసన తెలుపుతున్న కోడూరు గ్రామస్థులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

వాగులో దిగి గ్రామస్థుల నిరసన

అర్వపల్లి, అక్టోబరు 17: మండలంలోని కోడూరు గ్రామానికి వెళ్లే రహదారి వాగుపై వెంటనే వంతెన నిర్మించాలని కోడూరు గ్రామస్థులు డిమాండ్‌ చేశారు. మండలంలోని కోడూరు రహదారి వాగుపై వంతెన నిర్మించాలని వాగులో దిగి గ్రామస్థులు ఆదివారం ని రసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ కోడూరు గ్రామ ప్రజలు అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే వర్షం వచ్చినప్పుడల్లా గ్రామస్థులం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వాగు ఉధృతంగా ప్రవహించడంతో గ్రామస్థులు రెండు నుంచి మూడు రోజులు ఎటూ కదల్లేని పరిస్థితి ఉందన్నారు. గ్రామంలో ఎవరికైనా అనారోగ్యం సంభవిస్తే వైద్యం కోసం వెళ్లాంటే ఇబ్బందికరంగా మారుతుందన్నారు. ఈ విషయమై ఎన్నిమార్లు స్థానిక ప్రజాప్రతినిధులకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని వాపోయారు. వర్షం వచ్చినప్పుడల్లా వాగు దాటలేక ముగ్గురు, నలుగురు కలిసి తాళ్ల సాయంతో వాగును దాటాల్సిన పరిస్థితి నెలకొందని సర్పంచ్‌ గుయ్యని బాబు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కోడూరు గ్రామ రహదారిపై వంతెన నిర్మించి, తమ కష్టాలు తీర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ మండల ఉపాధ్యక్షుడు లక్ష్మ య్య, నాయకులు రవి, మురళి, భాస్కర్‌, కృష్ణబాబు, సూర్య, శ్రీనివాస్‌, సంపత్‌, సాయి, భార్గవ్‌, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-18T05:42:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising