ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోతెలో 15కిలోల గంజాయి స్వాధీనం

ABN, First Publish Date - 2021-10-17T06:01:01+05:30

బ్యాగుల్లో తరలిస్తున్న 15కిలోల గంజాయిని పో లీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మునగాల సీఐ ఆంజనేయు లు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉద యం మోతె బస్టాండ్‌ వద్ద అనుమానాస్పందంగా తిరుగు తున్న ముగ్గురు వ్యక్తులను మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ విచారించారు.

వివరాలు వెల్లడిస్తున్న సీఐ ఆంజనేయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మోతె, అక్టోబరు 16: బ్యాగుల్లో తరలిస్తున్న 15కిలోల గంజాయిని పో లీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. మునగాల సీఐ ఆంజనేయు లు తెలిపిన వివరాల ప్రకారం.. శుక్రవారం ఉద యం మోతె బస్టాండ్‌ వద్ద అనుమానాస్పందంగా తిరుగు తున్న ముగ్గురు వ్యక్తులను మోతె ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్‌ విచారించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విశాఖపట్నం జిల్లా, కోరట్ల మండలానికి చెందిన పంచదార్ల రమణ, అతని భార్య శాంతి, జిల్లాకు చెందిన పిట్ట అజయ్‌రెడ్డి కలిసి ఏపీలోని చింతపల్లి ఏజెన్సీ ఏరియాలోని అరకు ప్రాంతాల్లో గంజాయి కొనుగోలు చేశారు. గంజాయిని హైదరాబాద్‌కు చెందిన వడ్త్యా అర్జున్‌ జాదవ్‌కు అమ్మేందుకు ఒప్పం దం కుదుర్చుకున్నారు. బ్యాగుల్లో 15కేజీల గంజాయితో వైజాగ్‌ నుంచి ఆర్టీసి బస్సులో తెలంగాణ సరిహద్దు వరకు చేరారు. సరిహద్దు వద్ద పోలీసులు తనీఖీ చేస్తుండడంతో హైదరాబాద్‌కు వెళ్లలేక మోతె బస్టాండ్‌ వద్ద దిగారు. స్థానికులు బ్యాగులను గుర్తించి సమాచారం ఇవ్వడంతో పోలీసులు పట్టుకున్నారు. ఆ ముగ్గురి సమాచారం మేరకు హైదరాబాద్‌లోని వడ్త్యా అర్జున్‌ ఇంట్లో తనిఖీ చేయగా కిలోన్నర గంజాయి లభించించింది. నలుగురిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

Updated Date - 2021-10-17T06:01:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising