సాగర్ ఉపఎన్నిక బరిలో టీడీపీ
ABN, First Publish Date - 2021-02-13T20:40:17+05:30
నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది.
హైదరాబాద్: నాగార్జున సాగర్ ఉపఎన్నికలో పోటీ చేయాలని తెలంగాణ టీడీపీ నిర్ణయించింది. పార్టీ అభ్యర్థిగా మువ్వ అరుణ్ కుమార్ పోటీ చేయనున్నారు. ఈ మేరకు తాజాగా ప్రకటన విడుదల చేసింది. అధినేత నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతో ఉపఎన్నికపై క్లారిటీ ఇచ్చింది.
ఇదిలా ఉంటే, నాగార్జునసాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య అకాల మరణంతో అక్కడ ఉపఎన్నిక అనివార్యమయ్యింది. ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నప్రధాన పార్టీలు .. క్షేత్రస్థాయిలో ప్రచారాన్ని ఉధృతం చేశాయి. అధికార పార్టీ టీఆర్ఎస్‌కు దీటుగా కాంగ్రెస్, బీజేపీ ప్రచారంలో పాల్గొంటున్నాయి. సిట్టింగ్ స్థానంపై టీఆర్ఎస్ పార్టీ గురి పెట్టగా, తమ కంచుకోట అయిన నాగార్జున సాగర్‌లో పూర్వవైభవం కోసం కాంగ్రెస్ తీవ్రంగా శ్రమిస్తోంది.
Updated Date - 2021-02-13T20:40:17+05:30 IST