ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం

ABN, First Publish Date - 2021-02-28T04:59:32+05:30

హేమాచల క్షేత్రంలో భక్తుల కోలాహలం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 మంగపేట, ఫిబ్రవరి 27: మండలంలోని మల్లూరు హేమాచలకొండలపై వెలిసిన లక్ష్మీ నృసింహస్వామి దేవాలయంలో శనివారం భక్తుల రద్దీ విపరీతంగా పెరిగింది. జిల్లా నలుమూలల నుంచే కాకుండా సుదూర ప్రాంతాల నుంచి మేడారం సమ్మక్క- సారలమ్మ జాతరకు వెళ్లే భక్తులు ముందుగా స్వామివారిని దర్శించుకొని వెళ్లడం ఆనవాయితీ. ఇదే క్రమంలో మినీ మేడారంకు వెళ్లే భక్తులు శనివారం ఉదయమే కొండపైకి వచ్చి హేమాచల లక్ష్మీనృసింహస్వామిని పోటీపడి దర్శించుకున్నారు. చింతామణి జలధారల వద్ద చన్నిటీ స్నానాలు చేసిన భక్తులు జలాంజనేయ, పంచముఖాంజనేయ, వేణుగోపాల స్వామి దేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపైన వెలిసినటువంటి ఆదిలక్ష్మి, చెంచులక్ష్మి సమేత స్వయంభు పుట్టుస్వామిగా విరాజిల్లుతున్న లక్ష్మినృసింహస్వామిని భక్తులు దర్శించుకున్నారు.  ఆలయ విశిష్టత, స్వామివారి చరిత్రను సంక్షీప్తంగా అర్చకులు వివరించారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఆలయ ఈవో సత్యనారాయణ చర్యలను చేపట్టారు. అనంతరం భక్తులు తిరుగు ప్రయాణంలో గుట్టకింది భాగంలో ఉన్న ద్వైతమాతను దర్శించుకొని వెళ్లారు. 

Updated Date - 2021-02-28T04:59:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising