ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అవి బాధ్యతలను విస్మరించాయి: ఉత్తమ్ కుమార్ రెడ్డి

ABN, First Publish Date - 2021-11-26T00:00:46+05:30

ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ,టీఆర్ఎస్ పార్టీలు తమ ప్రాథమిక

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: ధాన్యం కొనుగోలు విషయంలో బీజేపీ ,టీఆర్ఎస్ పార్టీలు తమ ప్రాథమిక బాధ్యతను విస్మరించాయని కాంగ్రెస్ ఎంపీ  ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ధాన్యం కొనుగోలు చేయాలని కోరుతూ కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించిన ధర్నాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరి వద్దు, పామాయిల్ వేసుకోవాలని రాష్ట్ర  వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి చెబుతున్నాడన్నారు. కానీ పామాయిల్ లాంగ్ టర్మ్ పంట అని ఆయన పేర్కొన్నారు. వరి సేద్యంపై ఆంక్షలు పెట్టడం సరైంది కాదన్నారు. వరి రైతులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఉంటుందని ఆయన తెలిపారు. ఖరీఫ్ పంట ధాన్యం గురించి మాట్లాడకుండా, రబీ పంట గురించి కేసీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. బియ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఎగుమతి చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయట్లేదని ఆయన ప్రశ్నించారు. 



Updated Date - 2021-11-26T00:00:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising