ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నిధుల విడుదలపై కలెక్టర్ జోక్యం.. చట్టవిరుద్ధం: ఉత్తమ్

ABN, First Publish Date - 2021-08-31T20:20:07+05:30

సూర్యాపేట: సాధారణ పనులకు మున్సిపల్ నిధులు విడుదల చేసే అంశంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సూర్యాపేట: సాధారణ పనులకు మున్సిపల్ నిధులు విడుదల చేసే అంశంలో కలెక్టర్ జోక్యం చేసుకోవడం చట్టవిరుద్ధమని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. మంగళవారం మున్సిపల్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. అనంతరం ఉత్తమ్ మాట్లాడుతూ ఎమర్జెన్సీ పనుల పేరుతో.. సాధారణ పనులకు కలెక్టర్ నిధులు కేటాయించడం, చట్టవిరుద్ధమని చెప్పారు. దీనిపై కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలిపారు. వివక్ష చూపకుండా అన్ని వార్డులకూ నిధులను సమానంగా కేటాయించాలన్నారు. మున్సిపల్ సమావేశాలకు మీడియాను అనుమతించకపోవడాన్ని వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. ముంబై - హైదరాబాద్ బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలను.. సూర్యాపేట మీదుగా విజయవాడ వరకు పొడిగించాలని ప్రధానికి విన్నవించినట్లు తెలిపారు.  హైదరాబా - విజయవాడ.. 65వ జాతీయ రహదారిని ఆరు వరుసల రహదారిగా విస్తరించాలని ఎంపీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పేర్కొన్నారు.

Updated Date - 2021-08-31T20:20:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising