ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

ABN, First Publish Date - 2021-01-18T05:05:36+05:30

రాష్ట్ర సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం

పల్లెప్రకృతి వనాన్ని ప్రారంభిస్తున్న ఎంపీలు నామా నాగేశ్వర్‌రావు, కవిత
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ఫ్లోర్‌ లీడర్‌ నామా నాగేశ్వర్‌రావు


 స్వగ్రామంలో ఫంక్షన్‌హాల్‌ నిర్మాణానికి హామీ


కురవి, జనవరి 17 : రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ ఫ్లోర్‌ లీడర్‌, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వర్‌రావు అన్నారు. మండలంలోని బలపాల గ్రామంలో ఆదివారం ఆయన మహబుబాబాద్‌ ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మె ల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌తో కలిసి  రైతువేదిక, పల్లెప్రకృతివనాన్ని ప్రారంభిం చి మాట్లాడారు. సీఎం కేసీఆర్‌ పల్లెల అభివృద్ధికి బాటలు వేశారని, తెలంగాణ పల్లెల్లో జరుగుతున్న అభివృద్ధిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందన్నారు. రైతాంగానికి కాళేశ్వరం జలాలు అందించడంతో పాటు, రైతుబంధు, రైతుభీమా పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. తన పుట్టిన ఊరి ప్రజల సౌకర్యార్థం తన తల్లిదండ్రులు నామ ముత్తయ్య-వరలక్ష్మిల పేరిట ఫంక్షన్‌హాల్‌ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. అనంతరం గ్రామ సీనియర్‌ నేత దేవులపల్లి దేవయ్య విగ్రహాన్ని ఎంపీ ఆవిష్కరించారు. సర్పంచ్‌ ముం డ్ల ప్రమీల రమేష్‌, ఎంపీపీ గుగులోత్‌ పద్మావతి రవి, జడ్పీటీసీ బండి వెంకట్‌రెడ్డి, తోట లాలయ్య, బజ్జూరి పిచ్చిరెడ్డి, గార్లపాటి వెంకట్‌రెడ్డి, ఎంపీటీసీ రమణ ఉపేందర్‌, డాక్టర్‌ దేవులపల్లి కేశవరావు, డీఏవో చత్రునాయక్‌, ఏవో మంజూఖాన్‌, ఏఈ శ్రీనివాస్‌, సర్పంచులు తోట శోభారాణి రమేష్‌, రామ్‌లాల్‌ పాల్గొన్నారు. అంతకుముందు కురవి మండలంలోని కాంపెల్లి, తాళ్లసంకీస, మోద్గులగూడెం గ్రామాల్లో నిర్మించిన రైతువేదికలను ఎంపీ కవిత డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌తో కలిసి ప్రారంభించారు.


Updated Date - 2021-01-18T05:05:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising