ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మంత్రి జగదీశ్ రెడ్డికి తలనొప్పిగా మారిన రేవంత్ ట్వీట్

ABN, First Publish Date - 2021-06-08T18:41:18+05:30

టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఆయన

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

హైదరాబాద్: టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి చేసిన ట్వీట్ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. మంత్రి జగదీశ్ రెడ్డిని ఉద్దేశిస్తూ వ్యంగ్యంగా ఆయన చేసిన ట్వీట్‌ నెట్టింట సరికొత్త చర్చకు దారితీసింది. ఓ పత్రికా కథనాన్ని ఆధారం చేసుకుని.. మంత్రి జగదీశ్ రెడ్డిపై రేవంత్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు. 


‘రస’కందాయంలో హంపి ‘ధూమ్ ధామ్’... కోవర్ట్ ‘క్రాంతి’ కిరణాలతో కకావికలం... యముడు జగదీశ్ రెడ్డి ‘ఘంటా’ కొట్టినట్టేనా...? అంటూ ఆ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, క్రాంతి కిరణ్, మంత్రి జగదీశ్ రెడ్డిలను ఉద్దేశిస్తూ చేసినట్టుగా నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. త్వరలో టీఆర్ఎస్ పార్టీ మరో సంచలనానికి వేదిక కాబోతోందనడానికి ఈ ట్వీట్ సూచిక అంటున్నారు. 




ఇదిలా ఉంటే, గత జనవరిలో మంత్రి జగదీశ్ రెడ్డి తన కుమారుడి పుట్టినరోజు వేడుకలను కర్నాటకలోని హంపీలో జరిపారని ట్వీట్‌కు జత చేసిన పత్రికా కథనం తెలుపుతోంది. ఈ వేడుకలకు నలుగురు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కొంతమంది పార్టీ ప్రముఖులు హాజరయ్యారని, పేరుకు పుట్టిన రోజు వేడుకలైనా.. అక్కడ పార్టీ అంశాలే చర్చకు వచ్చినట్టుగా వార్తా కథనంలో ఉంది. కేటీఆర్‌ను సీఎం చేయడం, ఈటల కొత్త పార్టీ  తదితర అంశాలపైనే చర్చించినట్టుగా కథనాన్ని రాశారు. ఈ నేపథ్యంలోనే రేవంత్ ట్వీట్ ఆసక్తి రేకెత్తిస్తోంది.



Updated Date - 2021-06-08T18:41:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising